Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

TRADITIONAL HINDU MARRIAGE

By   /  May 20, 2016  /  No Comments

    Print       Email

Pasupu-Tadu_1986ఆచరణీయమైనది ఆచారం. మనిషిని మహోన్నతుడుగా తీర్చిదిద్దటానికి, పెడతోవ పట్టకుండా సక్రమ పద్ధతిలో నడిపించటానికి మన పూర్వికులు తమ మేధస్సును ఉపయోగించి, ఆలోచించి, చర్చించి ఏర్పరచినవి ఈ సంప్రదాయాలు, ఆచారాలు.  

మన పూర్వీకుల కాలం నుండి కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు, నిబంధనలు పాటిస్తూ వొస్తున్నాం.  అవి అన్నీ మన పూర్వికులు ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించి నిర్ణయించినవి.  కాని ఈ ఆధునిక కాలంలో కొన్నిటికి తిలోదకాలు ఇస్తూ వొస్తున్నాం.  కొన్ని సాంప్రదాయాలను, ఆచారాలను ఎవరూ మార్చలేరు.  మేము మార్చి చూపిస్తాం అని ఈనాటి తరం అనుకున్నా ఎంతమంది ఆ మార్పును హర్షిస్తున్నారు?  పోనీ, మార్పులు, చేర్పులు చేసుకుని ప్రశాంతవంతమైన జీవితాన్ని ఎంతమంది ఆస్వాదిస్తున్నారు? ఆస్వాదించగలుగుతున్నారు?

ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే మన పూర్వికులు ఎంతోఆలోచించి చేసిన సంప్రదాయాల వెనుక శాస్త్రీయ దృక్పథం కూడా ఉన్నది. వాటిని కొన్నిటిని పరిచయం చేయాలని jeelakarraనా  ప్రయత్నం. మగ, ఆడ ఇద్దరినీ కలిపేది వివాహబంధం. కడదాకా ఒకరికొకరు సహజీవనం సాగించటానికి వివాహబంధం తప్పనిసరి. వివాహం అన్నది ఒక వేడుక. పూర్వం యైదు రోజులు వివాహ వేడుకలు జరిగేవి. రానురాను ఈ బిజీ లైఫ్ లో కుదించుకుని ఒకరోజు వేడుకలాగా మారింది. అయినా వివాహంలోని ప్రధాన ఘట్టాలు ఏమి మారలేదు. మారవు కూడా.  హిందూ వివాహంలొ జరిపే విధులు ఒక్కొక్కటిగా…..  1. వరాగమనం 2. స్నాతకం 3. మధుపర్కం 4. మంగళస్నానం 5. గౌరీ/saptapadiగణపతి పూజ 6. కన్యావరణం 7. కన్యాదానం 8. సుముహూర్తం  9. మంగళసూత్రధారణ 10. తలంబ్రాలు 11. హోమం 12. పాణిగ్రహణం 13. సప్తపది 14. నక్షత్రదర్శనం  15. స్థాలీపాకం 16. నాగవల్లి. ఈ పదహారు విధులలో సుముహూర్తం చాలా ముఖ్యమైన ఘట్టం. దీనినే ‘జీలకర్ర, బెల్లం’ అని కూడా అంటారు.

మాంగల్యసూత్రధారణ తరువాత తలంబ్రాల ఘట్టం చాలా సందడిగా జరుగుతుంది. పాణిగ్రహణం, సప్తపది ఘట్టాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇంటికి క్రొత్తగా అడుగుపెడుతున్న వధువును చేయి పట్టుకుని ‘నీకు సర్వకాల సర్వావస్థలయందు నేనున్నాను’ అని వరుడు తెలియచేయటం. జీవితమంతా నీకు నేను తోడుంటాను అని ధైర్యం, నమ్మకం కలిగించటం. ‘నీ అడుగులో అడుగు వేసి, అన్నివేళలా నిన్ను వెన్నంటి నే talambraaluఉంటాను’ అని వరునికి వధువు తెలపటం ఈ సప్తపది. “యాన్త్వేవం గృహిణీపదం యు యువతయో వామా:కులస్యాధయ:” అన్నాడు కాళిదాసు. వివాహం కానంతవరకు ఆడపిల్ల ఎవరితో మాట్లాడినా, నవ్వినా, స్నేహం చేసినా చిన్నపిల్లగా చెల్లిపోతుంది. 

కాని వివాహం అయిన స్త్రీకి ఎన్నో నియమాలు, నిబంధనలు ఉంటాయి. గృహిణీ ధర్మం కత్తిమీద సాములాంటిది. అనుక్షణం జాగ్రత్తగా, కుటుంబ సభ్యులందరిని మెప్పించేలా, మంచి చెడులు తెలుసుకోవాలి. తెలియచేయాలి. వివాహ వేడుకలో వధువుకు మంగళసూత్రం, మెట్టెలు, నల్లపూసలు ధరింపచేయటం అంటే ఇక చిన్నతనం ముగిసింది అని తెలపటం. నీవు ఇక ఇంకొకరి అర్థాంగివి.metteluపరపురుషుడు తలవంచి చూసినా, తల ఎత్తి చూసినా అతనికి ఆమె మెడలో మంగళసూత్రం, నల్లపూసలు, మెట్టెలు అతనికి ‘ఆమె పరాయిది. ఇంకొక పురుషుడి భార్య’ అని హెచ్చరించటానికి పెట్టిన అలంకారాలు. మంగళసూత్రం అంటేనే జీవితభాగస్వామి అని అర్థం. అందుకే ఎక్కడ ఉన్నా, సర్వావస్థలయందు వివాహిత స్త్రీలకు జీవితసహచరుడిని గుర్తుచేస్తూ గుండెలమీదే ఉంటుంది.

ఈ రోజుల్లో చాలా మంది వివాహిత స్త్రీలు మంగళసూత్రాన్ని తీసి పక్కనపెట్టి, సన్నపాటి గొలుసు వేసుకుని ఆఫీసులకు వెళ్ళటం పరిపాటి అయింది. ఇది విదేశాలనుంచి పుణికిపుచ్చుకున్న ఆచారం. ఏ దేశమేగినా,ఎందుకాలిడినా నీ పుట్టుక, మన సంప్రదాయం, ఆచారం మరిచిపోకూడదు. మళ్ళీ కలిసినప్పుడు మన పూర్వికులు మనకు ఇచ్చిన సంప్రదాయ, ఆచార బహుమతుల గురించి ముచ్చటించుకుందాం! శెలవు!

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →