హీరో నాని-త్రినాథరావు కాంబినేషన్ లో మూవీ..
కంటిన్యూగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ కొడుతున్నాడు హీరో నాని. అదే రూట్ లో ‘సినిమా చూపిస్తా మావా’ దర్శకుడు త్రినాథరావు నక్కినతో ఓ మూవీ చేయనున్నారని టాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. రీసెంట్ గా ఈ విషయాన్ని రచయిత ప్రసన్న కుమార్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా తెలిపారు. బెక్కం వేణుగోపాల్ నిర్మించనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించనున్న ఈ చిత్రం జూలైలో సెట్స్ మీదికి వెళ్ళనుంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్న నాని తర్వాత విరించి వర్మ డైరెక్షన్ లో నటించనున్నారు. దర్శకుడు త్రినాథరావు, నిర్మాత బెక్కం వేణుగోపాల్ కాంబినేషన్లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండూ చిత్రాలు విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇది మూడో సినిమా.. ఇది కూడా హిట్ కొడితే హాట్రిక్ సాధించినట్లు అవుతుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇతర నటీ నటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.