Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Trivikram ‘A Aa’ Movie Poster Released ..

By   /  March 31, 2016  /  Comments Off on Trivikram ‘A Aa’ Movie Poster Released ..

    Print       Email

nithin-A AA movie posters 1‘అ ఆ’ మూవీ పోస్టర్స్ రిలీజ్..

 

InCorpTaxAct
Suvidha

 

త్రివిక్రమ్ డైరెక్షన్ లో నితిన్ – సమంత కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న మూవీ ‘అ ఆ’. బుధవారం నితిన్ బర్త్ డే సందర్భంగా ‘అ ఆ’ సినిమా తొలి ప్రచార చిత్రాలను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ మాట్లాడారు. త్రివిక్రమ్ రచించిన అందమైన కథను మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కించామన్నారు. మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామన్నారు. మిక్కీజె. మేయర్ అందించిన సంగీతం.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ మొదటివారంలో సినిమా షూటింగ్ పూర్తవుతుందన్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 6 న సినిమాని విడుదల చేయనున్నామని నిర్మాత వెల్లడించారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన సమంత హీరోయిన్ గా ఫస్ట్ టైమ్ కనిపించనున్నారు. సెకెండ్ హీరోయిన్ గా ‘ అనుపమ పరమేశ్వరన్’(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ, అనన్య, ఈశ్వరీరావు, సన, గిరిబాబు, నరేష్, రావురమేష్ , పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి నటిస్తున్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్- మిక్కిజె. మేయర్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్- ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కధ-మాటలు -స్క్రీన్ ప్లే-డైరెక్షన్- త్రివిక్రమ్.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TPAD’s “Blood Drive – Life Saving” event  in Frisco, Dallas, TX

Read More →