Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TRS always people’s party, says CM KCR..

By   /  April 13, 2017  /  Comments Off on TRS always people’s party, says CM KCR..

    Print       Email

kcrటీఆర్ఎస్ కి ప్రజల పిచ్చి ఉంది: సీఎం కేసీఆర్

 

InCorpTaxAct
Suvidha

 

 

తెలంగాణ సీఎం కేసీఆర్ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు. తాము తెలంగాణలో రిజర్వేషన్లపై చేస్తున్న కృషిని కొందరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 50 శాతం దాటకుండా రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలో లేదని ఆయన అన్నారు. ఇందిరా సహాని పిటిషన్ పై 50 శాతం దాటి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. అయితే మరో సమయంలో ప్రత్యేక పరిస్థితి ఉంటే రిజర్వేషన్లు 50 శాతం దాటి ఉండవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. ప్రతి పార్టీకి ఓ పిచ్చి ఉంటుందని అన్నారు. అలాగే తమ పార్టీకి ప్రజల పిచ్చి ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

ఉద్య‌మ స‌మ‌యంలో చాలామంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకని అన్నార‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌లకు న్యాయం జ‌రిగాల‌నే తాము పోరాడామ‌ని తెలిపారు. 1980లో త‌మిళ‌నాడులో 68 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు అవకాశం కల్పించారని అన్నారు. 1990లో త‌మిళ‌నాడులో ఎస్టీల‌కు ఒక శాతం పెంచారని అన్నారు. తాము తెలంగాణలో ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికల్లో గెలిచామని స్పష్టం చేశారు. తాము కేవలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్నామని అన్నారు. పక్క రాష్ట్రాల్లో కొనసాగుతున్న రిజర్వేషన్ల మాదిరిగానే తాము కూడా రిజర్వేషన్లు తీసుకొస్తామని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →