కోదండరాంపై టీఆర్ఎస్ నేతల ఫైర్
తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా ఒక వెలుగు వెలిగిన ప్రొఫెసర్ కోదండరాంను తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమికి పోషించిన కోదండరాంను తెలంగాణ సర్కార్, కేసీఆర్‌ను కానీ దగ్గరికి తీసిన దాఖలాలులేవు. దీంతో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, చేతకాకుంటే తప్పుకోవాలని కోదండరాం కేసీఆర్‌నుద్దేశించి అన్నారు. అంతే అప్పటి వరకు కోదండరాంను ఒక్కరుకూడా ఒక్క మాట అనని నేతలు ఇప్పుడు ఆయనపై విరుచుకపడుతున్నారు. ఆయన్ను వీరుడు… సూరుడు అని పొగిడిన నేతలంతా కోదండరాంను తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ బాల్కా సుమన్ అయితే కోదండరాం కుబుసం విడిచిన పాములాంటివాడన్నారు. తమక కలిసి రావాలని కోరినా కోదండరాం రాలేదని, ఇప్పుడు లేని పోని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను కోదండరాం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు తెలంగాణ రాష్ర్ట ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేఏసీ పుట్టకముందే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిందని కరీంనగర్ లో వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ ఎస్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకుందని అన్నారు. కోదండరాం అవాస్తవాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. కోదండరాం విమర్శల వెనక కుట్రలు, కుతంత్రాలు దాది ఉన్నాయా..? అంటూ ఈటల ప్రశ్నించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.