Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

TRS MLA Babu Mohan slams Chandra Babu Naidu

By   /  September 3, 2016  /  Comments Off on TRS MLA Babu Mohan slams Chandra Babu Naidu

    Print       Email

babu mohanచంద్ర‌బాబుపై బాబు మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

 

InCorpTaxAct
Suvidha

 

 

అంద‌రూ మ‌రిచిపోయిన ఓటుకు నోటు కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చి ఓ కుదుపు కుదుపుతోంది. అటు ఏపీలో.. ఇటు తెలంగాణ‌లో దుమారం రేపుతోంది. ఇంత‌కీ ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో ఫోన్‌లో మాట్లాండి బాబేన‌ని కొంద‌రంటుంటే.. కాదు కాదు ఎవ‌రితోనే మిమిక్రీ చేయించార‌ని టీడీపీ నేత‌లు వాదిస్తున్నారు. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహ‌న్ మాత్రం ఆ గొంతు ఖ‌చ్చితంగా చంద్ర‌బాబుదేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బాబు మోహ‌న్ మాట్లాడుతూ  “సుదీర్ఘ కాలం చంద్రబాబుతో కలిసి పనిచేసిన అనుభవం రీత్యా చెబుతున్నాను.. అది కచ్చితంగా చంద్రబాబు గొంతే” అని  తేల్చి పారేశారు. దీనికి బాబు ఊతపదాలుగా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఓటుకు నోటు కేసులో బాగా పాపులర్ అయిన ఆడియో టేపుల్లోని మాటలు.. “డోన్ట్ బాదర్” “ఐయామ్ విత్ యూ” లు చంద్రబాబు నోటివెంట ఎపుడూ వస్తూనే ఉంటాయని అవి బాబుకు ఊతపదాలని.. ఆడియో టేపుల్లో చంద్రబాబు గొంతు అంత స్పష్టంగా వినిపిస్తుంటే.. ఇక తాను ప్రత్యేకంగా చెప్పేదేముందని బాబు మోహ‌న్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు తాను టీఆర్ఎస్‌లోకి వెళ్లడానికి గల కారణాలను కూడా మోహ‌న్ బాబు చెప్పారు.  కొందరు వెధవల మాటలు విని చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వలేదని ఆ కారణం వల్లే పార్టీ మారాల్సి వచ్చింది తప్ప తాను “గోపీ” ని కాదని చెప్పుకొచ్చారు. టీడీపీ తనకు టిక్కెట్టు ఇవ్వలేదని తెలిసి ఫోన్ చేసిన కేసీఆర్.. టీఆర్ ఎస్ లోకి వచ్చేయమని ఆహ్వానించారని ఆ పార్టీలో ప్రస్తుతం తనకు తగిన గౌరవం లభిస్తుందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →