Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TRS MP Kavitha meets Narendra Modi seeking Turmeric Board at Centre

By   /  April 11, 2018  /  Comments Off on TRS MP Kavitha meets Narendra Modi seeking Turmeric Board at Centre

    Print       Email

ప‌సుపు బోర్డు ఏర్పాటు కోసం నేనూ పోరాడ‌తా

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* ఎంపీ క‌విత పోరాటం అభినంద‌నీయం

* ప‌సుపు బోర్డు ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ ప్ర‌ధానికి లేఖ రాశా

*యోగా గురు రామ్‌దేవ్ బాబ‌

డెక్క‌న్ అబ్రాడ్‌:  ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని, బోర్డు ఏర్పాటుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని ప్ర‌ముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా అన్నారు.  పసుపు రైతులను ఆదుకునేందుకు గడిచిన నాలుగేళ్లుగా ఎంపీ కవిత అలుపెరుగని పోరాటం చేస్తున్నార‌ని,  పసుపు బోర్డు సాధన కోసం ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి చేర్చాలని, ఆ ఉద్యమానికి తాను మద్దతుగా నిలుస్తానన్నారు. ఇప్పటికే పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశానని గుర్తు చేశారు. పసుపు దిగుమతులను నిలిపివేసి, ఎగుమతులను ప్రోత్సహించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్రానికి రామ్‌దేవ్ సూచించారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ సీఎం కే.చంద్రశేఖర్‌రావు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రముఖ యోగా గురువు రాందేవ్‌బాబా ప్రశంసల వర్షం కురిపించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా స్పందించిన రాందేవ్‌బాబా, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా నిజామాబాద్‌కు హాజరైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. ప్రత్యేకించి రైతాంగ శ్రేయస్సు కోసం కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని, దేశంలోనే మరే ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా కృషి చేస్తున్న సీఎంలను తాను చూడలేదన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో పాల్గొనేందుకు హాజరైన సందర్భంగా  ఎంపీ కవిత క్యాంపు కార్యాలయంలో రాందేవ్‌బాబా ఆమెతో పాటు మంత్రి హరీశ్‌రావు, ఇతర ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో పతంజలి పరిశ్రమల ఏర్పాటు విషయమై చర్చించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో రాందేవ్‌బాబా మాట్లాడుతూ తెలంగాణకు వచ్చినందుకే సీఎం కేసీఆర్‌ను పొగడడం లేదని, భారతదేశం ఆత్మ అయిన రైతన్నకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుండడం నిజంగానే ఎంతో ప్రశంసనీయమని అన్నారు.

తాను ఎంతోమంది సీఎంలను కలిశానని, పొరుగునేవున్న ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా తనకు మంచి స్నేహభావం ఉందని, అయినప్పటికీ దేశంలోనే మరే ఇతర సీఎంలు చేయని తరహాలో తెలంగాణ సీఎం కేసీఆర్ రైతాంగ శ్రేయస్సుకు పాటుపడుతున్నారని నిస్సందేహంగా చెప్పగల్గుతున్నానన్నారు. అనేక మంది వేదికలపై రైతులను ఆదుకుంటామని గొప్పగా ప్రకటనలు చేయడం మినహా, అన్నదాత ఆవేదనను అర్ధం చేసుకుని వారిని ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్‌, తన లక్ష్యాన్ని సాధించుకుని ఎంతో నిబద్ధతతో ముందుకు సాగుతోందని, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు కూడా చక్కటి క్రమశిక్షణను నేర్పించారని, కీలక పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ ఎంపీ కవిత, మంత్రి హరీశ్‌రావులు అహంభావాన్ని దరి చేర్చుకోకుండా అణుకువతో మెలగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →