Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

పార్టీని..ప్ర‌భుత్వాన్ని జోడు గుర్రాళ్లా న‌డిపిద్దాం

By   /  April 27, 2016  /  Comments Off on పార్టీని..ప్ర‌భుత్వాన్ని జోడు గుర్రాళ్లా న‌డిపిద్దాం

    Print       Email

trsplenaryటీఆర్ఎస్‌పార్టీ 15వ ఆవిర్భావ వేడుక‌లో కేసీఆర్‌

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని.. పార్టీని జోడు గుర్రాళ్లా న‌డిపిద్దామ‌ని, అందుకు ప్ర‌జ‌ల స‌హ‌కారం కూడా అవ‌స‌ర‌మ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావుఅన్నారు. టీఆర్ఎస్ పార్టీ 15వ ఆవిర్భావ వేడుక‌లు బుధ‌వారం ఖ‌మ్మం స‌మీపంలోని చెరుకూరి గార్డెన్స్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రపంచ ఉద్యమాలకు భాష్యం చెప్పేలా తెలంగాణ ఉద్యమం జరిగిందని 14 ఏళ్ల పాటు నిరంతరం సాగిన ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ సాధించామ‌న్నారు. స్వరాష్ట్రంలో స్వేచ్ఛావాయువుల మధ్య ప్లీనరీ నిర్వహించుకుంటున్నామ‌న్నారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రకు భాష్యం చెప్పేలా తెలంగాణ ఉద్యమం జ‌రిగింద‌ని, పార్లమెంట్ చరిత్రలో 36 పార్టీలను ఏకం చేయగలిగి అవిశ్రాంతంగా పోరాడాం కాబ‌ట్టే తెలంగాణాను సాధించుకోగ‌లిగామ‌న్నారు. రాష్రం వచ్చినా ఎన్నో అవరోధాలు సృష్టించారు. ఎన్నో బాలారిష్టాలు తట్టుకుని హిమాలయమంత ఎత్తుకు ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. ఎన్నికలు ఏవైనా ప్రజలు అపూర్వమైన మద్దతు ఇస్తున్నరు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని చాటిచెప్పారు.
వరంగల్ ఎంపీగా పసునూరి అధిక మెజారిటీతో గెలిపించడం అపూర్వఘట్టం. జీహెచ్‌ఎంసీలో కనీవినీ ఎరగని విజయాన్ని సొంతం చేసుకున్నం. మనకు గర్వం పనికిరాదు, అపజయాన్ని చూసి కుంగిపోవద్దు. జయాన్ని చూసి పొంగిపోవద్దు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలే బాసులు. వర్తమానం, భవిష్యత్ మీదనే దృష్టి సారించాలి. తెలంగాణ పునర్‌నిర్మాణ మహాయజ్ఞంలో అందరం కార్యకర్తలమేనని ఆయన పేర్కొన్నారు. ప్లీనరీలో తీర్మానాలంన్నింటినీ ఏకగ్రీవంగా ఆమోదించామని తెలిపారు. కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మిషన్ భగీరథలో భాగంగా రైతుల పొలాల్లో నుంచి వేసే పైప్‌లైన్ పనులను వేసవిలోగా పూర్తి చేసేందుకు ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలన్నారు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →