తుమ్మలకు హోం?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా దాని వెనకాల చాలా అర్థమే ఉంటుంది. ఎప్పుడు ఎవరికి ఏ హోదా ఇచ్చినా.. ఎవరిని పక్కన పెట్టిన దానికో లెక్క ఉంటుంది. అయితే పాలేరు ఉప ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుపై కేసీఆర్ కన్ను పడింది. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు అంతగా పట్టు లేకుండా ఉన్న తరుణంలో తమ్మల టీఆర్ఎస్లో చేరడంతో ఆ జిల్లా మొత్తం గులాబి రంగును పూసుకుంది. ఈ నేపథ్యంలోనే కీలకమైన హోంశాఖను తుమ్మల నాగేశ్వరరావుకి ఇవ్వబోతున్నట్లు సమాచారం. కమ్మ కుల పెద్దగా తుమ్మలకు ఆంధ్రా పారిశ్రామికవేత్తలు – సినీ ప్రముఖులతో సత్సంబంధాలున్నాయి. తెలంగాణ – ఆంధ్రా సరిహద్దు రాజకీయాలలో ఆరితేరిన తుమ్మలకు కీలకపదవి కట్టబెడితే అటు ఆంధ్రా నుంచొచ్చే సమస్యలకు సమాధానం చూపించగలడని పార్టీకి అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలవగలడని కేసీఆర్ భావిస్తున్నారట. అంతేకాదు ఈనాడు – ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలకు ఆంతరంగికుడిగా కూడా పేరొందారు.
ఇన్ని సానుకూల అంశాల తుమ్మల నాగేశ్వరరావులో ఉండడంతో కీలకమైన హోం శాఖ ఆయనకు ఇస్తే తెలంగాణ బార్డర్ సమస్యలు అన్నీ కూడా తుమ్మల చూసుకోగలడని, ఆ నమ్మకంతోనే ఆయనకు హోం శాఖ కట్టబెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉండి నడిచిన నాయిని నరసింహారెడ్డికి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంలోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. అయితే తుమ్మలకు హోం శాఖపై టీఆర్ఎస్లోని కొంతమంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.