Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

TRS Victory in Narayankhed By Elections..

By   /  February 16, 2016  /  Comments Off on TRS Victory in Narayankhed By Elections..

    Print       Email

trs logo

ఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం..
నారాయణఖేడ్ బై ఎలక్షన్స్ లో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. టీడీపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అయితే ఈ విజయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీఆర్ ఎస్ కు 93,076 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 39,451 ఓట్లు రాగా.. టీడీపీ 14,787 ఓట్లు దక్కించుకుంది. తమ అభ్యర్ధి విజయం సాధించడంతో కార్యకర్తలు తెలంగాణ భవన్ లో సంబరాలు జరుపుకున్నారు.

InCorpTaxAct
Suvidha

మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు టీఆర్ ఎస్ ను గెలిపించారని ఆ పార్టీ అభ్యర్ధి భూపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి బంగారు నారాయణ ఖేడ్ సాధిస్తామన్నారు. ప్రజల నమ్మకాని నిలబెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. తమ నియోజక వర్గంలో వలసలు ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు. వీటిని నివారించేందుకు సాగునీటి కొరత, సింగూరు జలాలను తీసుకువచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి వలసలను నివారిస్తామని తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →