చాక్ లేట్ కేక్ తింటూ సిరియాపై దాడులు చేయాలని చెప్పారట..!
సిరియా అమాయక ప్రజలపై రసాయన దాడులు చేసిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. దీనికి బదులుగా ఆ దేశ ఎయిర్ పోర్టుపై అమెరికా క్షిపణీ దాడులు కూడా నిర్వహించింది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిరియాపై దాడులు చేయాలనే నిర్ణయాన్ని చైనా అధ్యక్షుడితో భేటీ సమయంలో తీసుకున్నారట. ఈ విషయన్ని స్వయంగా ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. అంతేకాదు ఇదే విషయాన్ని చైనా అధ్యక్షుడికి కూడా తెలియజేశారట.
‘నేను సిరియాపై దాడులు చేయాలని నిర్ణయం తీసుకోవడానికి ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కలిసి డిన్నర్ చేశాను. డిన్నర్ తర్వాత ఇద్దరం చాక్ లేట్ కేక్ తిన్నాం. కేక్ జిన్ పింగ్ కు బాగా నచ్చింది. ఆ టైమ్ లో తనకు అమెరికా అధికారుల నుంచి ఓ మెసేజ్ వచ్చింది. షిప్ అను అన్నింటిని రెడీ చేశామని మెసేజ్ వచ్చింది. తాను స్పందిస్తూ దాడులు చేయాలని సూచించాను. అంతేకాకుండా తాము కొద్దిసేపటి క్రితం సిరియాపై దాడులు చేశామని జిన్ పింగ్ కు కూడా చెప్పాను. దీనికి ఆయన రెస్పాన్స్ ఇచ్చారు. చిన్న పిల్లలను గ్యాస్ లీక్ చేసి చంపిన వారిపై దాడులు చేయడం కరెక్టే అని అన్నారు ‘ అని ట్రంప్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.