Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Trump decries immigrants from ‘shithole countries’ coming to US

By   /  January 12, 2018  /  Comments Off on Trump decries immigrants from ‘shithole countries’ coming to US

    Print       Email

వలసవాదులపై మరోసారి ట్రంప్ విపరీత వ్యాఖ్యలు..

 

Suvidha
Biryani Pot

 

 

వలసదారులపై అగ్రరాజ్యం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ మరోసారి విపరీత వ్యాఖ్యలు చేశారు. ‘‘చెత్త దేశాల నుంచి వచ్చే వారందరూ మనకెందుకు..?’’ అంటూ వ్యాఖ్యానించారు. చట్టసభ సభ్యులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అలాగే వలసవాదులను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. వీసాల లాటరీని సగానికి పరిమితం చేయాలని అన్నారు.

మిగిలిన వాటిని తగిన ప్రాతినిధ్యం లేని ఆఫ్రికా దేశాలకు కేటాయించాలని లిండ్సే గ్రాహమ్ ఓ ప్రణాళికలను ట్రంప్ కు తెలియజేశారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ ‘‘హైతి, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి వల్ల మనకు ఏం ఉపయోగం ఉంది..? నార్వే వంటి దేశాల నుంచి అమెరికా ఎక్కువ మందిని రప్పించాలి’’ అని అన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఓ వ్యక్తి మీడియాకు లీక్ చేయడంతో అసలు విషయం బయటకు పొక్కింది.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Anasuya reveals her marriage secret

Read More →