రాంరెడ్డికి తెలంగాణ శాసనసభ నివాళి..
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. రెండో రోజు అసెంబ్లీలో పాలేరు ఎమ్మెల్యే రాం రెడ్డి వెంకటరెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాంరెడ్డి మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంకట్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రజా జీవితంలో ఆయన అనేక పదువులు అనుభవించారని పేర్కొన్నారు. ఐదు సార్లు శాసనభ్యుడిగా కొనసాగారని కొనియాడారు. తర్వాత కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పాషా ఖాద్రీ, సండ్ర వెంకటయ్య వీరయ్య, పువ్వాడ నాగేశ్వర్ రావు తో సహా పలువురు సభ్యులు వెంకట్ రెడ్డికి మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకట్ రెడ్డి మృతికి సభలో సభ్యులు రెండు నిమషాలు మౌనం పాటించారు. తర్వాత సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.
కాంగ్రెస్ కు తీరని లోటు: జానా రెడ్డి
రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి కాంగ్రెస్ కు తీరని లోటని ఆ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి అన్నారు. రాంరెడ్డి మృతి శాసన సభ్యులు అందరికి బాధ కలిగించిందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయం అంటే వెంకట్ రెడ్డికి చాలా ఇష్టమన్నారు. విద్యార్థి నాయకుడిగా కూడా ఆయన పని చేశారని తెలిపారు. వెంకట్ రెడ్డితో తనకు 33 సంవత్సరాలుగా పరిచయం ఉందన్నారు. అనుబంధం, ఆప్యాయతను కొనసాగించారని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచి రాంరెడ్డి రాజకీయాల్లో ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారని అన్నారు.
రాంరెడ్డి మరణం బాధించింది: మంత్రి తుమ్మల
కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణం చాలా బాధాకరమని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. గిరిజనులతో రాంరెడ్డి మమేకమయ్యారని తెలిపారు. ఖమ్మం రాజకీయాల్లో విలక్షమైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన వైద్య ఖర్చులకు వారు ఎంత అడిగినా ఇవ్వమని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.