టీఎస్. అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టిన సర్కారు
2014-15కు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర లెక్కలు, వార్షిక పద్దులపై.. కాగ్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాగ్ నివేదికలోని ముఖ్యాంశాలు..
* 2014-15లో రాష్ట్రంలో రాబడులు మొత్తం రూ.51,041.80 కోట్లు
* రాష్ట్ర పన్నులు రూ.29,288 కోట్లు
* పన్నేతర రాబడులు రూ.6,446.82 కోట్లు
* కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.8,188.58 కోట్లు
* గ్రాంట్లు ద్వారా వచ్చినవి రూ.7,118.10కోట్లు
* వ్యాట్ నిబంధనల ప్రకారం తనిఖీలు చేయని ఫలితంగా రూ.45.92 కోట్లు నష్టం
* గుత్తేదారు టర్నోవర్లు తప్పుగా నిర్వహించడం వల్ల రూ.8కోట్ల పన్ను తక్కువగా వేశారు.
* మీసేవా కేంద్రాల పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
* 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు శాఖల వారీగా కాగ్ పేర్కొన్న రాష్ట్ర ఖర్చులు.
వ్యవసాయ, సహకార శాఖకు రూ.5,380. 31 కోట్లు,
నీటిపారుదలశాఖకు రూ.8,052.87 కోట్లు,
ఇంధన శాఖకు రూ.3,504.49 కోట్లు,
మౌలిక వసతుల పెట్టుబడులు రూ.2,598.97 కోట్లు.
* ప్రాథమిక తరగతుల్లో అర్థంతరంగా చదువు మానేస్తున్న వారి సంఖ్య 26శాతం..
* మధ్యాహ్న భోజన పథకం నిధులు ఐదేళ్ల కాలంలో పూర్తిస్థాయిలో వినియోగం జరగలేదు..
* బీబీనగర్ నిమ్స్ అభివృద్ధి పనులు ఆగిపోయి రూ.80కోట్ల ఖర్చు వృధా..
* ప్రణాళికాలోపం వల్ల హైదరాబాద్ నిమ్స్‌లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందడం లేదు..
*2014-15 బడ్జెట్ అంచనాలు అవాస్తవికంగా ఉన్నట్లున్నాయి..
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.