సాగునీటి రంగం..ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాట్లాడారు. ఉద్యమ ఫలితంగానే దేవాదుల ప్రాజెక్టు వచ్చిందన్నారు. నిజాం సాగర్ ప్రపంచంలోనే ఫస్ట్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అన్నారు. జూరాల ప్రాజెక్టు కడితే నీళ్ళు నింపుకోని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రాజెక్టులపై వివక్షను తాము ఆనాడే ప్రశ్నించామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఉమ్మడి పాలకులు అంతర్రాష్ట్ర వివాదాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. రాష్ట్రానికి ఈ మాదిరి నీళ్ళు వచ్చాయంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లేనని అన్నారు. 75వేలకు పైన చెరువులను కాకతీయులే నిర్మించారని తెలిపారు. ఆ తర్వాత కూడా నిజాంషాహీలు చెరువుల తవ్వకాలను కొనసాగించారని సీఎం కేసీఆర్ అన్నారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామన్నారు. హరిత తెలంగాణ సాధించడమే తమ సర్కారు లక్ష్యమని తేల్చి చెప్పారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఆ జిల్లాకు చెందిన నేతలే కోర్టులో పిటిషన్ వేశారని గుర్తు చేశారు. అయితే ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేసిందన్నారు. తాము సీనియర్ ఇరిగేషన్ అధికారులతో కృష్ణా, గోదావరి నదులపై సర్వే చేయించామన్నారు.
ఎక్కడ చూసినా బ్యారేజీలే ఉన్నాయని.. అందువల్లే నీళ్ళకు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సాగునీటి రంగం..ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గూగుల్ మ్యాప్ సహకారంతో ప్రాజెక్టుల పరిస్థితులను విశ్లేషించారు. మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలుప్రాజెక్టులు కట్టాయని గుర్తు చేశారు. దీనివల్లే నీటి కొరత ఏర్పడుతోందన్నారు. మహారాష్ట్ర సర్కారు ఏ ఒక్క నదిని కూడా వదలిపెట్టకుండా మొత్తం ప్రాజెక్టులు కట్టిందన్నారు. అలాగే మంజీరా పై కర్నాటక సర్కారు బ్యారేజీలు నిర్మించిందన్నారు. బీమా నది పై వరుస బ్యారేజీలు ఉన్నాయన్నారు. 450 బ్యారేజీలు నిండిన తర్వతే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు వస్తాయన్నారు. అవన్నీ ఎప్పుడు నిండాలి.. రాష్ట్రానికి నీళ్ళు ఎప్పుడు రావాలి అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి చుక్కనీరు లేదంటే కారణం ఈ బ్యారేజీలేనని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.