తెలంగాణలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు..
తెలంగాణలో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అన్నిరకాల విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖకే అప్పగించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే అందులో మెడికల్, అగ్రికల్చర్, ఫార్మాలకు మాత్రం మినహాయింపు ఇవ్వనున్నారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా విద్యాసంస్థలు నిర్వహించడం వల్ల సమగ్రత లోపించిందని తెలంగాణ ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంచే శిక్షణ సరిగ్గా అందడం లేదన్నారు. అన్ని రకాల విద్యాసంస్థలను ఒకే గొడుకు కిందకు తెచ్చే విషయమై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాదు కొత్త విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విధాన రూపకల్పన జరగిపోవాలని ఆదేశాలు జారీచేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.