Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TS Congress leaders fires on CM KCR..

By   /  February 26, 2017  /  Comments Off on TS Congress leaders fires on CM KCR..

    Print       Email

jana reddyకేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ ఓ బందిపోటు ముఠాలా తయారైందని విరుచుకుపడ్డారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు వి. హనుమంతారావు, మల్లు రవి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మధ్యకాలంలో కేసీఆర్‌ కు బాగా అహంకారం పెరిగిందని ఆరోపించారు. ఆయన దిగజారుడు, నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎవరి సొమ్మని చెప్పి శ్రీవారికి కోట్ల రూపాయిల కానుకలు ఇస్తున్నారని ప్రశ్నించారు.
వ్యక్తిగతంగా మీరు అనుకున్న మొక్కులు మీ ఇష్టం అని అన్నారు. అయితే పేదలు కట్టిన పన్నులతో దేవుళ్ళకు కానుకలు ఎలా ఇస్తారని నిలదీశారు. ఇప్పటివరకు వేరే పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుక్కోవడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు. ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టర్లు ఎవరెవరు మీ ఇంటికి సూట్ కేసులు తీసుకువస్తున్నారో అందరికి తెలుసని అన్నారు. దొరికినచోటల్లా అప్పులు తెచ్చుతేవడం, కమీషన్లు తీసుకోవడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయలేదని ఆరోపించారు.కాంగ్రస్ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులకు మీరు స్విచ్చులు ఆన్ చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం డిజైన్ తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత నష్టమని మండిపడ్డారు. ప్రస్తుతం కేసీఆర్ అనుభిస్తున్న పదవి కూడా కాంగ్రెస్ వల్లే వచ్చిందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →