Loading...
You are here:  Home  >  Politics  >  Delhi Politics  >  Current Article

TS Eamcet Cancelled!

By   /  July 30, 2016  /  Comments Off on TS Eamcet Cancelled!

    Print       Email

5492_Eamcet_Paperఎంసెట్‌-2 రద్దు

ఎంసెట్-2పరీక్ష ఎట్టిపరి స్థితుల్లో రద్దు చేయవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు గత రెండు రోజు లుగా సచివాలయం ముందు ఆందోళనలు చేస్తున్న తెలంగాణ స‌ర్కార్ మాత్రం ర‌ద్దుకే మొగ్గు చూపింది. పోలీసులందజేసిన నివేదికపై మంత్రులు, ఉన్నతవిద్యాశాఖ అధికారులలో లోతుగా చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పరీక్షరద్దుపై న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని తొలుత నిర్ణయించారు. అయితే ఇప్పటికే పరీక్షరద్దు విషయంలో ఆలస్యం అయినందున, మరింత జాప్యం జరిగితే విద్యార్థులపై ఒత్తిడి పెరిగే ప్రమాదముందని భావించిన ఆయన ఎంసెట్-2 రద్దుకే మొగ్గు చూపారు. 56వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి.. రద్దు చేయడం తగదన్న వాదనలు గట్టిగా వినిపించినా ఒక్కరికి పేపర్ లీకయినా పరీక్ష రద్దు చేయాలని న్యాయ నిపుణులు సూచించడంతో ఇక పరీక్షను రద్దు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడైనా రద్దుచేసి, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారానే ప్రతిభావంతులైన విద్యార్థులకు న్యాయం చేసినట్లు అవుతుందని న్యాయనిపుణులు అంటున్నారు.

InCorpTaxAct
Suvidha

కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వెంటనే హాల్ టికెట్లను జారీచేసి, ఆగస్టు మొదటి వారంలో పరీక్ష నిర్వహించి, రెండో వారంలో ఫలితాలు ప్రకటించి సెప్టెంబర్ నాటికే తరగతులు ప్రారంభిస్తే విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎంసెట్-2 పేపర్ లీకేజీకి పాల్పడ్డ నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా ఎవ‌రో ఒక‌రు చేసిన త‌ప్పుకు వేల మంది విద్యార్థులు శిక్ష అనుభ‌వించి రావ‌డం బాధ‌ప‌డాల్సిన అంశ‌మే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →