Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

TS Govt focus on Pending Irrigation Projects..

By   /  March 14, 2016  /  Comments Off on TS Govt focus on Pending Irrigation Projects..

    Print       Email

harish rao1

పెండింగ్ ప్రాజెక్టులపై సర్కారు దృష్టి: మంత్రి హరీశ్ రావు

InCorpTaxAct
Suvidha

 

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో పెండింగ్‌లో ఉన్నవాటిపై టీఎస్. సర్కారు దృష్టి పెట్టింది.తక్షణం ఆ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.సమయానికల్లా అన్ని పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రాజెక్టు పనులను స్వయంగా సమీక్షింస్తామన్నారు. దీంతో పాటు అక్కడే నిద్రయోయే అవకాశాల్ని పరిసీలిస్తామన్నారు.

 

మంత్రి హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ ..

 

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా అధికారులను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసి జులైలోగా రైతులకు సాగు నీరందించేందుకు సర్కారు కృత నిశ్చయంతో ఉందని.. వీటిని పూర్తి చేసేందుకు నిధుల కొరత ఏ మాత్రం లేదన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సర్కారు అంత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇక పెండింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి ప్యాకేజీల వారీగా ప్రోగ్రెస్‌ కార్డులను తయారు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం తాను సమీక్షిస్తామని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు. జులైలోగా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించని పక్షంలో.. అలసత్వం ప్రదర్శించిన అధికారులు, ఇంజనీర్లను ఉపేక్షించేది లేదని హరీష్‌రావు హెచ్చరించారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →