Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TS PCC Chief Uttam Kumar Reddy promises loan waiver to farmers

By   /  January 12, 2018  /  Comments Off on TS PCC Chief Uttam Kumar Reddy promises loan waiver to farmers

    Print       Email

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ

 

Suvidha
Biryani Pot

 

 

 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేలా మ్యానిఫెస్టో తయారు చేస్తామన్నారు. గాంధీభవన్‌లో కిసాన్‌ ఖేత్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా రైతులు నష్టపోతూనే ఉన్నారని అన్నారు. అయిన ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

ఎన్నికల వేళ నాలుగు వేల పెట్టుబడి ఇస్తామంటున్నారని విమర్శలు చేశారు. ఆర్మూరులో ఇటీవల నిర్వహించిన రైతు సదస్సులో రూపొందించిన డిక్లరేషన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. దీనికి మరింత ప్రచారం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ నెల 17న కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని అన్నారు. 31 జిల్లాలకు 570 మండలాలకు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Anasuya reveals her marriage secret

Read More →