Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

TS. PCC Chief Uttam Kumar Reddy slams on Etela Rajender’s budget..

By   /  March 13, 2017  /  Comments Off on TS. PCC Chief Uttam Kumar Reddy slams on Etela Rajender’s budget..

    Print       Email

uttam-kumar-reddyకమిషన్ వచ్చే వాటికే భారీ నిధుల కేటాయింపులు.. ఉత్తమ్ విమర్శలు..

 

InCorpTaxAct
Suvidha

 

లంగాణ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈటెల రాజేందర్ బడ్జెట్ తీరు చాలా ప్రమాదకరంగా ఉందని అన్నారు. ఈ ఎకానామిక్ ఇయర్ చివరినాటికి తెలంగాణ అప్పు లక్షా 40 వేల కోట్లకు చేరుతుందని అన్నారు. నాలుగేళ్లలో రూ.70 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.ఇలా అప్పులు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో సర్కారు అన్నీ తప్పడు లెక్కలు చూపిస్తోందని ఆరోపించారు. కేవలం‌ రూ.1,400 కోట్లే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.

మిషన్ భగీరథ ప్రాజెక్టుకు వేల కోట్లు కేటాయింపులు చేశారని అన్నారు. వాటిలో కేసీఆర్ కు కమిషన్లు వస్తాయని అన్నారు. అందుకే ఫీజు రీయింబర్స్ మెంట్ కు కేటాయింపులు తగ్గాయని ఆరోపించారు. రెండు పడగదులు ఇప్పటివరకు కట్టినవి 1400 మాత్రమేనని అన్నారు. కాని మంజూరు చేసినవి మాత్రం 2.60 లక్షలు అని తెలిపారు.

ఇక 3.30 లక్షల మంది దళితుల్లో మూడేళ్లలో కేవలం మూడు వేల మందికే మూడెకరాల భూమి ఇచ్చారని చెప్పారు. కమీషన్లు వచ్చే శాఖలకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చేశారని ఆరోపించారు. అదే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రుణ మాఫీలో వడ్డీ భారాన్ని‌భరిస్తామని చెప్పారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు దాని ప్రస్తావనే తీసుకురాలేదన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →