Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

‘Tuntari’ audio release..

By   /  February 21, 2016  /  Comments Off on ‘Tuntari’ audio release..

    Print       Email

Tuntari1

‘తుంటరి’ ఆడియో రిలీజ్..
నారా రోహిత్ – లతా హెగ్డే జంటగా నటించిన మూవీ ‘తుంటరి’. శ్రీ కీర్తి ఫిలిమ్స్‌ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కుమార్‌ నాగేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి అశోక్‌ బాబా, నాగార్జున నిర్మిస్తున్నారు.. సాయికార్తీక్‌ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాటలను హైదరాబాద్‌లోని జయభేరి క్లబ్‌లో రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఈ మూవీ ట్రైలర్ ని తెలంగాణ టీడీపీ నేత రేవంత రెడ్డి ఆవిష్కరించారు. అలాగే ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ ఆడియో సీడీలను విడుదల చేశారు.

InCorpTaxAct
Suvidha

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. టీడీపీ సైన్యం అరవై లక్షలు మేర ఉందన్నారు. మన సైన్యం ఈ సినిమాను రెండు సార్లు చూసినా చాలని చెప్పారు.ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అన్నారు. అలాగే ఈ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ కూడా మాట్లాడారు. మురుగదాస్‌ కథ అందించిన ‘మాన్ కరాటే’ చిత్రానికి ఈ మూవీ రీమేక్‌ అన్నారు. ట్రైలర్‌, పాటలు చాలా బాగున్నాయని ప్రశంసించారు.హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. ఇంత మంచి కథను తెచ్చి నాతో సినిమా చేస్తున్నందుకు దర్శకనిర్మాతలకు థాంక్స్‌ అని అన్నారు. ఈ సినిమాలో కామెడీ చేశానని తెలిపారు. పక్కా కమర్షియల్‌ సినిమా అవుతుందన్నారు.పాటలు చాలాబాగా వచ్చాయని సాయికార్తీక్ చెప్పారు. తారకరత్న మాట్లాడుతూ..’ నారా రోహిత్ సైలెంట్‌గా కనపడతాడు. కానీ మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న నటుడు. మాస్‌, కామెడీ సహా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమిది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడెల శివరామ్‌, వీరేందర్‌ గౌడ్‌, కరణం వెంకటేష్‌, కబీర్‌ సింగ్‌ పాల్గొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →