Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Tweet War Between Siddaramaiah and Yogi Adityanath

By   /  January 8, 2018  /  Comments Off on Tweet War Between Siddaramaiah and Yogi Adityanath

    Print       Email

యోగీ వర్సెస్ సిద్ద రామయ్య..!

 

InCorpTaxAct
Suvidha

 

 

కర్ణాటక సీఎం సిద్ధా రామయ్య, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ అదిత్యనాధ్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతుంది. రాబోయే కర్ణాటక ఎన్నికలపై దృష్టి పెట్టిన వీరిద్దరూ సోషల్ మీడియా వేధిక చేసుకొని ఒకరి గురించి మరోకరు వ్యంగాస్త్రాలు వేసుకోవడం నెటిజన్లకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మా రాష్ట్రానికి రాబోతున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు స్వాగతం. మా దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మేము నిర్వహిస్తున్న ఇందిర క్యాంటిన్, రేషన్‌ షాప్‌లను సందర్శించండి. ఈ పథకాలు మీ రాష్ట్రంలో ఆకలి చావులను నియంత్రించడానికి పనికొస్తాయని అంటూ కామెంట్ పెట్టారు. దీనికి స్పందించిన యోగీ.. మీ స్వాగతానికి ధన్యవాదాలు.

దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునేది మీ రాష్ట్రంలోనే అని నేను విన్నాను, అలాగే నిజాయితీ ఆఫీసర్ల బదిలీలు, వారి మరణాలకు కూడా మీ ప్రభుత్వమే కారణమట కదా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా రాష్ట్రంలో మంచి చేయడానికే ప్రయత్నిస్తానని అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఎన్నికల ముందే కర్ణాటకలో రాజకీయ వేడి రాజుకుంటున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ సారి కాంగ్రెస్ విజయం తన ఖాతాలో వేసుకుంటుందా లేక బీజేపీనే విజయం సాధిస్తుందా అన్నది భవిష్యత్ లో తేలనుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →