Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Two letters were sent to the division of the state

By   /  March 12, 2018  /  Comments Off on Two letters were sent to the division of the state

    Print       Email

రాష్ట్ర విభ‌జ‌న కోసం బాబు రెండుసార్లు లేఖ‌లు ఇచ్చారు

Suvidha
Biryani Pot

 

 

 

* టీడీపీ ఏపీలో స‌మైక్య‌, తెలంగాణ‌లో విభ‌జ‌న ఉద్య‌మం చేసింది

* ఎన్నిక‌ల ముందు 1200 హామీలు ఇచ్చి ఏ ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేదు

* రాష్ట్రానికి బీజేపీ ఎంతో చేసింది. రాష్ట్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డిఉంది.

* శాస‌న మండ‌లిలో సోము వీర్రాజు

డెక్క‌న్ అబ్రాడ్‌: చ‌ంద్ర‌బాబు నాయుడు అనుకున్నంత మంచోడు కాదా?  ఆయ‌న ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌డ‌తాడా? ఆయ‌న‌వ‌న్నీ స్వార్థ రాజ‌కీయాలేనా?  రాష్ట్రం విడిపోవ‌డానికి బాబు కార‌ణ‌మా? అంటే అవున‌నే అంటున్నారు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు సోము వీర్రాజు. గ‌త కొద్ది రోజులుగా చంద్ర‌బాబుపై సోము ఒంటికాలుపై లేస్తున్నాడు. బాబు కానీ.. ఆయ‌న పార్టీ నేత‌లు కానీ బీజేపిని ఎవ‌రైనా ఏమైనా అంటే వాళ్ల బండాన్ని బ‌య‌ట పెట్టి క‌డిగేస్తున్నారు. తాజాగా శాస‌న‌మండ‌లి వేదిక‌గా బాబుపై సోము వీర్రాజు మ‌రోమారు నిప్పులు చెరిగారు. ఏపీ విభ‌జ‌న కోసం చంద్ర‌బాబు నాయుడు రెండుసార్లు లేఖ‌లు ఇచ్చార‌న్నారు. సీపీఎం మిన‌హా అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌ విభజనకు అంగీకరించాయని చెప్పారు. అంతా సమన్యాయం అన్నారే తప్ప ఏ ఒక్కరూ ఏపీకి ఏం కావాలనే విషయాన్ని అడగలేదని ఈ సందర్భంగా సోము వీర్రాజు గుర్తు చేశారు. విభజన సమయంలో ఏపీ గురించి పార్లమెంటులో మాట్లాడిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు.

చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల ముందు ఏపీలోనేమో స‌మైక్య ఉద్య‌మం,  తెలంగాణలో విభజన ఉద్యమం చేశార‌ని, ఇప్పుడు రాష్ట్రాన్ని విడ‌గొట్టారంటూ ముస‌లిక‌న్నీరు కారుస్తున్నార‌ని విమ‌ర్శించారు.  బాబు ఎన్నిక‌ల ముందు  అధికారంలోకి వచ్చేందుకు 1200 హామీలు చేసిందని, అందులో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని హామీలు పదేళ్లలో అమలు చేయాలని ఉంటే తాము మాత్రం మూడేళ్లలోనే చాలా వరకు అమలు చేశామని చెప్పారు. బీజేపీని నిందిస్తే ఏపీకి మంచి జరగదని, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి  సోము వీర్రాజు స్ప‌ష్టం చేశారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →