Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Two rowdy-sheeters done to death in Anantapur

By   /  July 22, 2016  /  Comments Off on Two rowdy-sheeters done to death in Anantapur

    Print       Email

kodavaliఅనంత‌లో `ర‌క్త చ‌రిత్ర`

 

InCorpTaxAct
Suvidha

 

 

అనంత‌పురంలో ర‌క్త‌చ‌రిత్ర మ‌ళ్లీ మొద‌లైంది. పాత క‌క్ష‌లు పురివిప్పాయి. వేట‌కొడ‌వ‌ళ్ల‌కు ప‌నిచెప్పాయి. అంతే న‌డిరోడ్డుపై న‌రికి చంపుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే…గోపి,వెంకటేష్ ఇద్దరు దివంగత పరిటాల రవికి అనుచరులు. పరిటాల రవి మరణించాక కూడా పరిటాల శ్రీరామ్ అనుచరులుగా కొనసాగుతున్నారు. వీళ్ల ఇద్ద‌రినీ గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నిన్న హ‌త‌మార్చారు. ప్ర‌త్య‌ర్థులు గోపి వెంక‌ట్‌ల‌ను ఆటోతో ఢీ కొట్టించి వేట కొడ‌వ‌ళ్ల‌తో అతి కిరాత‌కంగా న‌రికి చంపారు. అయితే ఈ హత్యలకు అనంతపురం ఎమ్మెల్యే  ప్రభాకర్ చౌదరి వర్గీయులే చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక దర్యాపుతులో తేల్చారు. కొంత కాలంగా ప్రభాకర్ చౌదరి వర్గానికి, పరిటాల వర్గానికీ విభేదాలున్నట్లు చెబుతున్నారు. పరిటాల శ్రీరామ్ అనంతపురం రాజకీయాల్లో పెత్తనం చెలాయించడం ప్రభాకర్ చౌదరి వర్గానికి గిట్టడం లేదని..ఈ విషయంలోనే గత కొద్ద్ది రోజులుగా రెండు వర్గాల మధ్యా పోరు నడుస్తున్నట్టు సమాచారం.

కాగా ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులు ఫ్యాక్షన్ కి బలవ్వడం చూస్తున్నాం.కానీ ఈ జంట హత్యలు, హతులు,దోషులు కూడా ఒకే పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. అయితే అనంత టీడీపీలో ఈ అంతర్గత పోరు ముందుముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని పార్టీ వర్గాలు ఆందోళన చెబుతున్నాయి. మ‌ళ్లీ పాత క‌క్ష‌లు మొద‌లు అయితే మాత్రం ఇప్ప‌ట్లో ఆప‌డం క‌ష్టం. ఈ హ‌త్య‌ల‌పై ప‌రిటాల శ్రీ‌రామ్ ఎలా స్పందిస్తారోన‌ని అంతా ఆస‌క్తిగా చూస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →