Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

U-19 World Cup: India beat Sri Lanka by 97 runs, seal spot in final

By   /  February 9, 2016  /  Comments Off on U-19 World Cup: India beat Sri Lanka by 97 runs, seal spot in final

    Print       Email

india-final

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో యువ భారత్..!

InCorpTaxAct
Suvidha

బంగ్లాదేశ్ లో జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో యంగ్ ఇండియా ఫైనల్ కు చేరింది. ఢాకా స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యర్ధి శ్రీలంకపై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ ఆరంభం నుంచి యంగ్ ఇండియా చెలరేగి ఆడుతోంది. ఇప్పుడు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్  50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. అయితే టోర్నీలో బాగా రన్స్ చేసిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో 14 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇతనితో పాటు మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 7 పరుగులతో వెనుతిరిగాడు. అంటే 27 పరుగులకే భారత్ ఓపెనర్లను కోల్పోయిందన్న మాట. తర్వాత బ్యాటింగ్ వచ్చిన అనుమోల్ ప్రీత్ సింగ్ (72: 92 బంతుల్లో 6×4, 1×6), సర్ఫరాజ్‌ ఖాన్‌ (59: 71 బంతుల్లో 6×4, 1×6) హాఫ్ సెంచరీలతో జట్టుకు అండగా నిలిచిచారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 96 పరుగులు జత చేశారు. అనంతరం వాషింగ్టన్‌ సుందర్‌ (43), అర్మాన్‌ జాఫర్‌ (29) రాణించడంతో యువభారత్‌ 267 పరుగులు చేయగలిగింది.

india-final-a

అనంతరం 268 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించారు. 13 పరుగులకే ఓపెనర్లను పెవిలియన్‌కు పంపిచారు. అయితే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్లు షమ్ము ఆషన్‌ (38), విషాద్‌ రందిక (28), దమిత సిల్వా (24) జట్టును ముందుకు నడిపించేందుకు ప్రయత్నించారు. భారత బౌలర్లు వారి వికెట్లు తీయడంతో 42.4 ఓవర్లలో 170 పరుగులకే శ్రీలంక కుప్ప కూలింది. దీంతో 97 పరుగుల తేడాతో యంగ్ ఇండియా జట్టు విజయం సాధించి ఫైనకి ఓ అడుగు దూరంలో నిలిచింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →