Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

ఉగాది సాహిత్య సమ్మేళనం

By   /  April 26, 2016  /  No Comments

    Print       Email

_______ ________ _______ హ్యూస్టన్ లో తొలి సారిగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వారాంతంలో జరుగుతున్న ఉగాది సాహిత్య సమ్మేళనం ఏర్పాట్లు ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సుప్రసిద్ద కవి, అనువాదకులు డా. ముకుంద రామారావు గారు (ఇండియా), చందమామ మొదలైన అనేక పత్రికల ​పూర్వ సంపాదకులు, పాత్రికేయులు శ్రీ పి.ఎస్. గోపాల కృష్ణ (చెన్నై), కవి తమ్మినేని యదుకుల భూషణ్ (న్యూ జెర్సీ), కవి విన్నకోట రవి శంకర్ (నార్త్ కెరొలైనా), టెక్సస్ సాహితీవేత్తలు చంద్ర కన్నెగంటి, సత్యం మందపాటి, మెడికో శ్యాం, పూడూర్ జగదీశ్వరన్, పద్మ దేవగుప్తాపు మొదలైన వారు, స్థానిక హ్యూస్టన్ నగర రచయితలు తమ సాహిత్య ప్రసంగాలతో తెలుగు భాష మాధుర్యాన్ని మనకి మరొక్క సారి రుచి చూపించనున్నారు. ఆసక్తికరమైన చర్చా వేదిక, CP బ్రౌన్ పురస్కార ప్రదానం, ఉగాది ఉత్తమ రచయితల గుర్తింపు, “పద్మ పద్య వాహిని” & “అదే గాలి” పుస్తకావిష్కరణలు ఇతర ఆకర్షణలు.

మధ్యాహ్నం విందు, ఫలహారాలతో సహా ఈ మొత్తం కార్యక్ర్రమం ఉచితం, వినోద భరితం, విజ్ఞాన దాయకం.
మన నెల నెలా తెలుగు వెన్నెల పరంపరలో ఇది 69 వ కార్యక్రమం. కలకాలం గుర్తు ఉండే అపురూపమైన అనుభూతులని మూటగట్టుకునే అవకాశం.

InCorpTaxAct
Suvidha

పూర్తి వివరాలకి ఇందుతో జతపరిచిన ఆహ్వానం చూడండి….ఈ శనివారం (ఏప్రిల్ 30, 2016) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తెలుగు సాహితీ విందు…
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి 40వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించబడుతున్న ఈ సరదా సాహిత్య కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తప్పకుండా వచ్చి ఆనందించండి. ప్రవేశ రుసుము లేదు. ఈ సభలు జరిగే వేదిక Maharaja Restaurant, 3711 HWY 6 South, Houston, TX. 77082.

​నెల నెలా తెలుగు వెన్నెల బృందం​

​​వంగూరి చిట్టెన్ రాజు, చిలుకూరి సత్యదేవ్, మధు పెమ్మరాజు, శాయి రాచకొండ, సుధేష్ పిల్లుట్ల, దీప్తి & శ్రీనివాస్ పెండ్యాల

తెలుగు సాంస్కృతిక సమితి నిర్వాహక వర్గం
అర్జున్ ఘట్టమనేని (తె.సాం.స అధ్యక్షులు), కొంపట్ల కొండల రావు (సాహిత్య విభాగం)​, మాధవి ఆకారపు (ప్రత్యేక కార్యక్రమాలు), ఉష రంగరాజ్, బ్రహ్మ బెరివీర, రాము ఉప్పలపాటి, కృష్ణ గుండారపు, దేవి సిరిగిరి, రాజ్ పసల, శాంత సుసర్ల (Trustee), రవి తమిరిశ (Trustee), దుర్గా ప్రసాద్ సేలోజ్ (Trustee)

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →