
చిత్రం-ఉండమ్మా బొట్టు పెడతా(1968)
సంగీతం– కె.వి.మహదేవన్
రచన–దేవులపల్లి కృష్ణశాస్తి గారు
గానం-పి.సుశీల
పల్లవి :
ఎందుకీ సందెగాలి
సందెగాలి కేళి మురళి (2)
తొందర తొందరలాయె
విందులు విందులు చేసే
॥
చరణం : 1
ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము ఆగలేక నాలాగే ఊగే ఈ దీపము
పరుగు పరుగునా త్వర త్వరగా
ప్రభుని పాదముల వాలగ
తొందర తొందరలాయె
విందులు విందులు చేసే ఎందుకీ॥
చరణం : 2
ఏనాటిదో గాని ఆ రాధా పల్లవ పాణీ
ఏమాయెనో గాని
ఆ పిల్లన గ్రోవిని విని॥
ఏదీ ఆ… యమున
యమున హృదయమున గీతిక
ఏదీ బృందావన మిక
ఏదీ విరహ గోపిక ॥
ఈ సుమధుర గీతాన్ని ఇక్కడ https://www.youtube.com/watch?v=wVQLSv5l_3Q వినండి !
టీవీయస్.శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.