Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Understanding between KCR and Babu

By   /  July 2, 2016  /  Comments Off on Understanding between KCR and Babu

    Print       Email

AP CM N. Chadrababu Naidu with C M of Telangana K. Chandrashekhar Raoవాళ్ల‌మ‌ధ్య చీక‌టి ఒప్పందం నిజ‌మేనా?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన ద‌గ్గ‌రి నుంచి ఇరు రాష్ట్రాల ఉద్యోగులు, ప్ర‌జ‌లు గొడ‌వ‌లు ప‌డుతున్నారు త‌ప్పితే తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ బాగానే ఉన్నారు.  దీన్ని బ‌ట్టి చూస్తే వాళ్లిద్ద‌రూ ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోకుండా వాళ్ల‌ స్వార్థం కోసం ప‌నిచేస్తున్నారా? ఇద్ద‌రి మ‌ధ్య చీక‌టి ఒప్పందాలు ఏమైనా జ‌రిగాయా? అంటే మాత్రం కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ అవున‌నే అంటున్నారు. మెద‌క్‌జిల్లాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పొన్నం మాట్లాడుతూ కేసీఆర్ – చంద్రబాబుల మధ్య ఖ‌చ్చితంగా చీక‌టి ఒప్పందం జ‌రిగింద‌ని పున‌రుద్ఘాటించారు. వారిద్దరూ రహస్యంగా ఒప్పందం చేసుకున్నారని.. అందుకే హైకోర్టు విభజన జరగడం లేదని పొన్నం ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు దిగుతానని అంటున్నారని.. దాని వల్ల ఎలాంటి ఫలితం ఉండదని.. చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబుతో చర్చలు జరపాలని సూచించారు. ఏపీ సీఎంతో కేసీఆర్ మాట్లాడి న్యాయవాదుల సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.

కేసీఆర్ స్వార్థంతో ప్రవర్తిస్తున్నారని అందుకే న్యాయవాదులు రోడ్డెక్కి నిరసన తెలిపే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. మరోవైపు హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయ‌వాదులు చేప‌డుతున్న ఆందోళ‌న‌ల‌కు అన్ని పార్టీల నాయ‌కులు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఆందోళ‌న‌ల్లో కూడా పాల్గొంటున్నారు. మ‌రి హైకోర్టు ఇప్ప‌ట్లో జ‌రుగుతుందా?  కేసీఆర్ ఢిల్లీలో చేసే ధ‌ర్నాకు కేంద్రం స్పందిస్తుందా? అనేది మ‌రికొన్ని రోజులు ఆగితే కానీ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →