Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Unique opportunity to act with Pawan, says Kazal

By   /  April 6, 2016  /  Comments Off on Unique opportunity to act with Pawan, says Kazal

    Print       Email

kazal 2

పవన్ తో నటించడం అద్భుత అవకాశం : కాజల్

InCorpTaxAct
Suvidha

 

 

 

కెరీర్ ప్రారంభం నుంచి పవర్ స్టార్ సరసన నటించాలని కోరిక ఉంది. అయితే మిగిలిన సినిమాల కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని ముద్దుగుమ్మ కాజల్ అంటోంది. పవన్ సరసన కాజల్ ఫస్ట్ టైమ్ సర్థార్ గబ్బర్ సింగ్ మూవీలో నటించింది. ఉగాది కానుకగా ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడింది.

‘ఇండస్ట్రీలోకి వచ్చిన సమయం నుంచి పవన్ గారితో నటించాలని ఉండేది. మధ్యలో కొన్ని అవకాశాలు కూడా వచ్చాయికానీ కుదరలేదు. పవన్ గారితో పనిచేశాక ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సినిమాలంటే పవన్ కల్యాణ్ కి ప్రాణం. సెట్ లో ఉన్నంత సేపు సినిమాల ధ్యాస తప్ప వేరే ఉండదు. క్రమశిక్షణ, అంకిత భావంతో నటించడం ఆయన్ను చూసి నేర్చుకున్నా. పవన్ సినిమా కోసం చాలా కష్టపడతారు. పవన్ లో మంచి నటుడే కాదు.. మంచి ఫిల్మ్ మేకర్ కూడా ఉన్నారు. సినిమాకి సంబంధించి అన్ని శాఖల మీద ఆయనకు పట్టుంది. సెట్ లో చాలా తక్కువ మాట్లాడుతారు. కాని ఆయన మాట్లాడిన మాటలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఎదుటి మనిషిలో ఎంతో స్పూర్తిని నింపుతాయి. ఆయన మాట్లాడుతుంటే అలా చూస్తూ వినాలనిపిస్తుంది.

చాలామంది హీరోయిన్స్ పవన్ కల్యాణ్‌ అంటే భయమని చెప్పగా విన్నాను. నేనైతే ఏ మాత్రం భయపడలేదు. ఏ ఆర్టిస్ట్‌కైనా సౌకర్యంగా ఫీలయ్యేలా చేయడం పవన్ గారి ప్రత్యేకత’ అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.ఫస్ట్ టైమ్ సర్ధార్ మూవీకోసం కాజల్ డబ్బింగ్ చెప్పింది. దాని గురించి చెబుతూ ‘నాతోటి కథానాయికలు చాలామంది డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. ఇందులో నాది యువరాణి క్యారెక్టర్‌ కావడంతో కొన్ని కీలక సన్నివేశాలకు నేనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నా’ అని తెలిపింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →