Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

UP CM Yogi Adityanath Sensational Decision

By   /  January 7, 2018  /  No Comments

    Print       Email

సీఎం యోగి ఆదిత్యానాథ్‌ మరో సంచలన నిర్ణయం..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యోగి ఆదిత్యానాథ్‌ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు పెంచారు. తాజాగా యోగి ఆదిత్యానాథ్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి కాషాయం రంగు పూయాలని గతంలో ఆయన అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రధాన కార్యాలయంతో సహా హజ్‌ కమిటీ ఆఫీసులకు కూడా అధికారులు కాషాయం రంగు పూయటంతో ఇస్లాం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఖండించదగ్గ అంశం.

సాధారణంగా ఈ రంగు రాజకీయాల కోసం వాడేది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపు హజ్‌ యాత్రికులను కూడా కాషాయపు దుస్తులు ధరించమంటారేమో.. అని లక్నో హజ్‌ కమిటీ అధికారి షాహర్‌ ఖాజీ మౌలానా అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హజ్‌ కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మోసిన్‌ రాజా.. సీఎం యోగి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కాషాయం రంగు శక్తి, వెలుగులకు చిహ్నమని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన పేర్కొంటున్నారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →