ట్రంప్ వచ్చిన తర్వాత రష్యా-అమెరికా సంబంధాల్లో మరింత క్షీణత: వ్లాదిమిర్ పుతిన్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర విమర్శలు చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు క్షీణించాయని అన్నారు. వాస్తవానికి ట్రంప్ వచ్చిన తర్వాత సంబంధాలు మెరుగు అవుతాయని అందరూ భావించారని అన్నారు. కాని వాస్తవంలో మాత్రం అలాంటి పరిస్థితి ఏమీ లేదని అన్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ లేనంతగా క్షీణించాయని వ్యాఖ్యానించారు.
సిరియా ఆర్మీ రసాయన దాడులు చేయడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. సిరియా ఎయిర్ పోర్టుపై దాడి చేసింది. దీనిపై పుతిన్ స్పందించారు. వాస్తవానికి సిరియా ఎప్పుడో రసాయన దాడులను వదిలిపెట్టేసిందని అన్నారు. అటువంటి దాడులు చేసే అవకాశమే లేదని అన్నారు.అయితే తిరుగుబాటుదారుల దగ్గర ఉన్న రసాయన ఆయుధాల నిల్వలపై ఆ దేశ ప్రభుత్వం వైమానిక దాడులు చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందువల్లే అక్కడ విష వాయువులు వచ్చి ఉంటాయని అన్నారు. దానివల్ల స్థానిక ప్రజలు మరణించి ఉండవచ్చని అన్నారు. దీన్ని అమెరికా ఉపయోగించుకుని దాడులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.