సాదర ఆహ్వానం
“మూడవ తెలుగు మహిళా రచయిత్రుల సాహిత్య సమ్మేళనం“
ఆగస్టు 20-21, 2016
ఉచిత ప్రవేశం
ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా
కళా సుబ్బా రావు వేదిక, శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్ పల్లి, హైదరాబాదు
సాహితీప్రియులకు నమస్కారం…ఇది వరలో మేము విజయవంతంగా నిత్వహించిన మహిళా రచయితల సాహిత్య సమ్మేళనాల స్ఫూర్తి తో ముచ్చటగా మూడో సారి తెలుగు మహిళా రచయిత్రులకి తమదే అయిన మరొక సాహిత్య వేదిక ఏర్పాటుచేసే సదుద్దేశ్యంతో, రాబోయే ఆగస్టు 20-21 వ తేదీలలో హైదరాబాదులోనిశ్రీ త్యాగరాజ గానసభలో, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్) వారి ఆధ్వర్యంలో “మూడవ తెలుగు మహిళా రచయిత్రుల సాహిత్య సమ్మేళనం” జరగబోతోంది.
మహిళలు ప్రధాన నిర్వాహకులుగా ఉండే ఈ మహా సభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులూ, రచయితలూ,భాషాభిమానులూ మొదలైన వారందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.
మహిళా వక్తలకు ఆహ్వానం, ప్రసంగాశాల సూచనలు
ఈ సమ్మేళనంలో సాహిత్య పరమైన అంశాల మీద ప్రసంగించదల్చుకున్న మహిళా వక్తలకు ఇదే మా ఆహ్వానం. ప్రసంగాశాలుగా కొన్ని సూచనలు ఈ క్రింద పొందుపరిచాం.
ప్రాచీన సాహిత్యం, గత శతాబ్దంలో సాహిత్య పరిణామం, గత పదిహేనేళ్ళ ఆధునిక సాహిత్య పోకడలు, కథ, కవిత, వ్యాస ప్రక్రియలలో స్త్రీ పాత్రల చిత్రీకరణ, బుల్లి తెర, పెద్ద తెరలు, ఇతర ప్రసార మాధ్యమాలు, పత్రికలు, అంతర్జాల భాషా సాహిత్యాలలో స్త్రీల పాత్ర, ప్రాముఖ్యత, సమస్యల అవగాహన, వ్యక్తీకరణ, జానపద, శాస్త్రీయ తదితర కళా రూపాలలో సాహిత్యం, భావ ప్రకటనలో భాషలో వస్తున్న మార్పులు, తెలుగు సాహిత్యం భవిష్యత్తు, ప్రపంచీకరణ,, ఆంగ్ల భాష ప్రభావం మొదల్లైన సాహిత్య పరమైన అంశాలు.
స్వీయ రచనా పఠనం
తమ కవితలని, సంక్షిప్త రచనలనీ ఆహూతుల సమక్షంలో చదివి వినిపించే అవకాశం.
ఆసక్తి ఉన్న మహిళా వక్తలు, స్వీయ రచనా పఠనంలో పాల్గొనదనదల్చుకున్న వారు ఈ క్రింది వారిని సంప్రదించి వివరాలు తెలియజేయవలసిన
ఆఖరు తేది: ఆగస్ట్ 10, 2016
డా. తెన్నేటి సుధా దేవి (Hyderabad)
(సంచాలకులు)
ఫోన్: 92465 77745
డా. ముక్తేవి భారతి (అధ్యక్షులు, నిర్వాహక బృందం)
E-Mail Correspondence
vangurifoundation@gmail.com
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.