Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Vegesna Foundation’s Ghantasala and SPB events in USA

By   /  September 19, 2019  /  No Comments

    Print       Email

అమెరికాలో 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 9వ బాలు సంగీతోత్సవాలు

సెప్టెంబర్ 21- నవంబర్ 10, 2019

InCorpTaxAct
Suvidha

  అందరూ ఆహ్వానితులే

ఈ వారాంతం నుండి ..అనగా..అనగా సెప్టెంబర్ 21, 2019 నుండి నవంబర్ 10, 2109 దాకా 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 9వ బాలు సంగీతోత్సవాలు పేరిట అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అనేక నగరాలలో అత్యున్నత స్థాయి సినీ సంగీత కచేరీలు జరుగుతున్నాయి. 

ప్రవేశ రుసుము లేని ఈ కార్యక్రమాలకి అందరూ ఆహ్వానితులే.

ఈ సినీ సంగీత విభావరిలో ప్రధాన గాయకుడిగా హైదరాబాద్ నుంచి “అపర ఘంటసాల” తాతా బాల కామేశ్వర రావు (10వ సారి అమెరికా పర్యటన), ప్రధాన గాయని గా హ్యూస్టన్ నివాసి “గాన రత్న” శారద ఆకునూరి అన్ని నగరాలలోనూ తమ అసమాన గానకౌశలంతో అలనాటి, ఈ నాటి మాధుర్యమైన పాటలతో అలరిస్తారు. వీరిరువురూ ప్రపంచ వ్యాప్తంగా వేలాది గాన కచేరీలు చేసిన లబ్ధ ప్రతిష్టులు.

న్యూ జెర్సీ, ఆస్టిన్, అట్లాంటా, హ్యూస్టన్, డిట్రాయిట్, లాస్ ఏంజెలెస్ నగరాల పూర్ర్తి కార్యక్రమ వివరాలు ఇందుతో జత పరిచిన ప్రకటనలలొ చూడండి. ఇతర నగరాల పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం.

ఘంటసాల ఆరాధనోత్సవాలు జరిగే తేదీలు, నగరాలు

(National Sponsor: Vanguri Foundation of America, Inc: Local Sponsors: Telugu Associations)

సెప్టెంబర్ 21 (New Jersey); సెప్టెంబర్ 22 (Atlanta, GA); సెప్టెంబర్ 27 (Austin, TX); సెప్టెంబర్ 29 (Houston); అక్టోబర్ 5 (Detroit, MI); అక్టోబర్ 13 (Los Angeles); అక్టోబర్ 18(Tallahasse, Fl); అక్టోబర్ 19(Okala, Fl); అక్టోబర్ 20 (Weston, Fl); అక్టోబర్ 25 (New York); అక్టోబర్ 26(Chicago); అక్టోబర్ 27 (Raleigh); నవంబర్ 2 & 3 (Orlando, Fl); నవంబర్ 8: (Augusta, GA); నవంబర్ 9 (Charlotte)

నవంబర్ 10 (ఇండియానా పొలిస్)

If anyone is interested in arranging this unique program in their town, please contact us. AVAILABLE DATES: సెప్టెంబర్ 28: అక్టోబర్ 4, 6, 11, 12, & నవంబర్ 1, 2019.

కార్యక్రమం కోసం సంప్రదించవలసిన వారు: వంశీ రామరాజు (Whatsapp ఫోన్ నెంబర్: 98490 23852, ramarajuvamsee@yahoo.co.in; వంగూరి చిట్టెన్ రాజు (832 594 9054)

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంగీత విభావరి కార్యక్రమాలు వేగేశ్న ఫౌండేషన్ (హైదరాబాద్) దివ్యాంగుల సేవాశ్రమానికి విరాళాల సేకరణ నిమిత్తం జరుగుతున్నాయి. 1988 లో కొందరు అమెరికా తెలుగు వారు నెలకొల్పిన వేగేశ్న సంస్థ గత 31 సంవత్సరాలలో వేలాది బీద దివ్యాంగ బాలబాలికలని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది, ప్రస్తుతం సుమారు 500 మంది బీద, అనాధ వికలాంగ బాలబాలికలకి జీవనోపాధికి కావలసిన ఉచిత విద్య, వైద్య సదుపాయాలతో పునరావాసం కలిస్తోంది. “సేవా బ్రహ్మ” వంశీ రామరాజు ఈ సంస్థ ధర్మ కర్తగా, మేనేజింగ్ ట్రస్టీ గా ఈ 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలలో స్వయంగా పాల్గొంటారు.

మరొక్క సారి ఈ ఉచిత ఉన్నత స్థాయి గాన విభావరి కార్యక్రమాలకి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ..

ఫోన్: 832 594 9054: E-mail: vangurifoundation@gmail.com    

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TAMA’s 10th Semiannual Chess Tournament

Read More →