
పాడవోయి భారతీయుడా అనే ఈ పాట 1961లో విడుదలైన వెలుగు నీడలు చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రచయిత శ్రీ శ్రీ, గానం ఘంటసాల, పి. సుశీల, మాధవపెద్ది సత్యం, వెంకటేశ్వరరావు, స్వర్ణలత. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, నటీనటులు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, గిరిజ, ఎస్.వి.
రంగారావు, రేలంగి, సూర్యకాంతం. దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు. అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన వెలుగు-నీడలు ఒక మంచి సాంఘిక చిత్రం. ప్రతి మనిషి జీవితంలో వెలుగు నీడలు వుంటాయని, వాటిని దీరోదాత్తంగా ఎదుర్కొనాలని హితవు చెప్పే ఈ చిత్రం ప్రతి సన్నివేశాన్ని రసవత్తరంగా తీర్చిదిద్దారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు.పాడవోయి భారతీయుడా నృత్య గీతంలో రాజసులోచన అతిథిగా పాల్గొన్నారు.కలకానిది నిజమైనది రేడియో స్టేషనులో పాట రికార్డింగ్
సందర్భంగా ఆర్కెస్ట్రా కండక్టర్ గా పెండ్యాల నాగేశ్వరరావు కనిపిస్తారు.
***
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ
పాడవోయి భారతీయుడా
నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం
నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం
నేడే నవోదయం నీదే ఆనందం ఓ..
పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ..
పాడవోయి భారతీయుడా
ఓ ఓ ఓ ఓ
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసీ
సంబర పడగానే సరిపోదోయి
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ
సంబర పడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొందీ
అదే విజయమనుకుంటే పొరపాటోయి ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా ఆ ఆ
ఆగకోయి భారతీయుడా
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
అవినీతి బంధుప్రీతి
చీకటి బజారూ
అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ
కాంచవోయి నేటి దుస్థితి
పదవీ వ్యామోహాలు కులమత భేధాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
పదవీ వ్యామోహాలు కులమత భేధాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనే వాడే ఏ ఏ
ప్రతి మనిషి మరియొకని దోచుకొనే వాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే
స్వార్ధమే అనర్ధకారణం
అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్
స్వార్ధమే అనర్ధకారణం
అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్
స్వార్ధమే అనర్ధకారణం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే
లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం
లోకానికి మన భారతదేశం
అందించునులే శుభ సందేశం
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=avBaFtPkuhwవినండి!
టీవీయస్. శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.