వెంకయ్య నోట..బాబు మాట
ప్రత్యేక హోదా గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నారో.. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా అదే అన్నారు. బాబు మాట వెంకయ్య నాయుడు నోట రావడంతో ఏపీ ప్రజలు సీరియస్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన వెంకయ్య నాయుడు ఇలా మాట మార్చడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెద్యశిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో తనపై వచ్చే విమర్శలకు జవాబు చెప్పబోనని అంటూనే ఆర్థిక సంఘం ప్రతిపాదనలతో సందిగ్ధత నెలకొని ప్రత్యేక హోదా సమస్య తలెత్తిందన్నారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కేవలం హోదా వల్లే అంతా జరిగిపోతుందని భావించకూడద న్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందే, అయినంతమాత్రాన అది సర్వరోగ నివారిణి కాదు, సంజీవని అంతకంటే కాదన్నారు. ఇప్పటికే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందని, రాష్ట్రానికి పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలను మంజూరుచేసిందని చెప్పారు.
విభజనతోపాటే హోదా కూడా చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ప్రత్యేక హోదా సమస్య తలెత్తి ఉం దేదికాదని చెప్పారు. దేశమంతటా ఒకే విధంగా పన్నుల విధా నాన్ని అమలు చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొం దుతుందని తాను భావిస్తున్నానన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని పేర్కొని ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.