వెంకయ్య ఆవేదనకు కారణమేంటి?
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కొద్ది రోజులుగా చాలా టెంక్షన్ పడుతున్నారట. ఎవరికీ చెప్పుకోలేక లోలోన మథనపడిపోతున్నారట. ఆయన బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే చెబుతున్నారు కూడా. ఇంతకీ వెంకయ్య నాయుడి ఆవేదన కారణమేంటంటే.. ప్రత్యేక హోదా విషయంలో ఎక్కువ ప్రెజర్ ఫీలవుతున్నది వెంకయ్యనాయుడే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు, నరేంద్రమోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్‌ని ఈయనే తెరపైకి తెచ్చారు. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ద్వారా ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించింది వెంకయ్యనాయుడే.
అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు, అప్పటి ప్రధానితో ఆ ప్రకటన చేయించగలిగారుగానీ, ఇప్పుడు కేంద్ర మంత్రంగా ఉండి కూడా నరేంద్రమోడీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇప్పించలేకపోతున్నారు.
నాడు ప్రతిపక్షంలో ఉన్న తనకు కాంగ్రెసు పార్టీ గౌరవం ఇచ్చిందని, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి, సీనియర్ నాయకుడిగా తనుకు గౌరవం ఇవ్వలేకపోతోందని వెంకయ్యనాయుడు ఆవేదన చెందుతున్నారట. కానీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నిర్ణయాలు తీసుకోవడం దశాబ్దాలపాటు కాషాయజెండా మోసిన వెంకయ్యనాయుడుకు చేతకావడంలేదు. క్లిష్ట సమయాల్లో పార్టీని ఇబ్బందుల్లోకి లాగడం వెంకయ్యనాయుడుకి సముచితంగా అనిపించడంలేదట. ఇన్నేళ్ళ రాజకీయ జీవితం ఈ ప్రత్యేక హోదా కారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడాన్ని వెంకయ్యనాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. పార్టీలో సీనియర్ నాయకులకు ఇప్పటికే పొగపెట్టిన నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడుకు కూడా అలాగే పొమ్మనలేక పొగపెడుతున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.