Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Venkaiah Naidu don’t want to be elected to Rajya Sabha from Telugu states?

By   /  May 15, 2016  /  Comments Off on Venkaiah Naidu don’t want to be elected to Rajya Sabha from Telugu states?

    Print       Email

13-1447402271-venkaiah-naidu-601ఏపీ నుంచి వ‌ద్దే వ‌ద్దు..!

 

InCorpTaxAct
Suvidha

 

 

వెంక‌య్య‌నాయుడి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం వ‌చ్చే నెల 29వ తేదీతో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆయ‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా అవ‌కాశం క‌ల్పించి ఆయ‌న సేవ‌ల‌ను వాడుకోవాల‌ని బీజేపీ చూస్తోంది. ఎవ‌రికీ కూడా మూడు సార్లు మించి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇవ్వ‌ని బీజేపీ వెంక‌య్య‌నాయుడి విష‌యంలో విన‌హాయింపు ఇస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే స‌మ‌స్య అంతా ఆయ‌న ఏ రాష్ట్రం నుంచి ఎన్నిక అవుతారా అన్న‌దే. ఈ విష‌యంలో మాత్రం వెంక‌య్య నాయుడు ఒక అవ‌గాహ‌నకు వ‌చ్చార‌ట‌. ఏపీ నుంచి ఎన్నిక‌వుతే త‌న‌కు స‌మ‌స్య‌లు త‌ప్ప‌ని గ్ర‌హించిన వెంక‌య్య తాను ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్నాట‌క నుంచి మూడు సార్లు ఎన్నిక అయిన రాష్ట్రం నుంచే మ‌రోసారి ఎన్నిక కావ‌డం మంచిద‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.  ప్రత్యేక హోదా విషయంలో ఏపీలోని విపక్షాలు – ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న తరుణంలో ఇక్కడి నుంచి ఎన్నికయితే తనపై ఆ బాధ్యతలు మరింత పెరుగుతాయన్న భయంతో వెంకయ్య మళ్లీ కర్ణాటకకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

మిత్రపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు మంచి మిత్రుడే అయినా ఆ పార్టీ నేతల్లో కొందరు వెంకయ్యను వ్యతిరేకిస్తున్నారు. విపక్షాలు కూడా ప్రత్యేక హోదా విషయంలో ఆయన్ను కౌంటర్ చేస్తున్నాయి. ఏపీకి రావాల్సిన ప్రయోజనాల విషయంలోనూ వెంకయ్యను టార్గెట్ చేస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో ఆయన తాను ఏపీ వాడినైనా కర్ణాటక నుంచి గెలిచానని.. దేశం కోసం పనిచేయాలి కానీ ఒక్క ఏపీ కోసమే కాదని చెప్పి తప్పించుకుంటున్నారు. ఒకవేళ ఏపీ నుంచి గెలిస్తే అలా తప్పించుకునే అవకాశాలు తగ్గుతాయి. దీంతో అవన్నీ ఆలోచించి ఆయన ఏపీ నుంచి కాకుండా కర్ణాటక లేదా మధ్య ప్రదేశ్ నుంచి వెళ్లాలని అనుకుంటున్నారట.  బీజెపి శాసనసభ్యుల సంఖ్య అతి తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి తాను రాజ్యసభకు ఎన్నికయ్యే సమస్యే లేదని ఇటీవల వెంకయ్యే స్వయంగా ప్ర‌క‌టించారు కూడా.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →