Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Venkatesh Green Signal to movie with Naga Chaitanya

By   /  March 20, 2018  /  Comments Off on Venkatesh Green Signal to movie with Naga Chaitanya

    Print       Email

వెంకీ-చైతు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

డెక్క‌న్ అబ్రాడ్‌:సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌, యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో  సినిమా రానుంద‌ని కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా క‌ల్యాణ్ కృష్ణ పేరు వినిపించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ ప్రాజెక్ట్‌ను బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర‌) తెర‌కెక్కించనున్నార‌ని తెలిసింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయ‌ని స‌మాచారం. కాగా, మే నెల‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.  వెంకటేష్-నాగ చైతన్య తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నప్పటికీ దీని కోసం ప్రత్యేకంగా కాల్ షీట్స్ సెట్ చేసుకుంటున్నట్టు తెలిసింది. తేజ దర్శకత్వంలో ఆటా నాదే వేటా నాదే(వర్కింగ్ టైటిల్)షూటింగ్ లో వెంకీ బిజీగా ఉండగా చైతు ‘సవ్యసాచి’ పూర్తి చేసే పనితో పాటు మారుతీ దర్శకత్వంలో ‘శైలజారెడ్డి గారి అల్లుడు’ కోసం రెడీ అవుతున్నాడు. ఇవి కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో తన లైఫ్ పార్టనర్ సమంతాతో కలిసి నటించే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

నాన్న నాగార్జునతో మనంలో నటించిన చైతు ఇప్పుడు మావయ్య వెంకటేష్ తో నటించడం అంటే థ్రిల్ కలిగించే విషయమే. పైగా ఫాన్స్ కోరుకుంటున్న కాంబినేషన్ కాబట్టి సహజంగానే హైప్ వచ్చేస్తుంది. మే లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో హీరొయిన్ ని సాంకేతిక వర్గాన్ని సెట్ చేసే పనిలో దర్శకుడు బాబీ బిజీగా ఉన్నట్టు టాక్. యంగ్ హీరోలతో కాంబోలు చేస్తున్న వెంకీ కొత్త ట్రెండ్ కు సారధిగా నిలుస్తున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →