నేను కూడా బాహుబలినే.. వీహెచ్ ఆశక్తికర వ్యాఖ్యలు..
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ నాయకులకు బాహుబలి మేనియా పట్టుకున్నట్లుంది. జానారెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత రాజకీయ బాహుబలి గురించి తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో తాను కూడా బాహుబలినే అని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర వ్యాఖ్యానించారు. ఎవరైతే జనాన్ని ఆకర్షించగలరో వారే బాహుబలి అవుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి బాహుబలులు చాలామంది ఉన్నారని అన్నారు. వారిలో నేను కూడా ఓ బాహుబలినే అని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేశారు. 20 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న నేతల కంటే మంత్రి కేటీఆర్ చాలా దీమాగా మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో చెప్పే మాటలు క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు వేరుగా ఉంటాయన్నారు. మంచినీటిలో డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించాలని సూచించారు.దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తానని చెప్పారు. పనిలో పనిగా మోదీపై కూడా విమర్శలు చేశారు. యూపీలో రైతులకు రుణ మాఫీ చేస్తే ఖచ్చితంగా పోరాటం చేస్తామని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.