Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Vijay In Pawan Kalyan Film..?

By   /  August 11, 2016  /  Comments Off on Vijay In Pawan Kalyan Film..?

    Print       Email

vijay devarakonda Bపవన్ సినిమాలో విజయ్ దేవరకొండ.?

 

InCorpTaxAct
Suvidha

 

 

ఇటీవలె విడుదలై సూపర్ హిట్ అయిన చిత్ర ‘పెళ్లిచూపులు’. ఈ మూవీలో హీరోగా యువ నటుడు విజయ్ దేవరకొండ నటించారు. సినిమా బంపర్ హిట్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన తర్వాతి సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. విజయ్ కి పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని సమాచారం.

పవన్ కు అత్యంత సన్నిహితుడు అయిన నిర్మాత శరత్ మరార్.. విజయ్ కి ఫోన్ చేసి అభినందనలు తెలిపారట. అంతేకాదు.. ఓసారి కలుద్దాం అంటూ చెప్పారట. విజయ్ ని తమ ఆఫీసుకు రావాల్సిందిగా ఆహ్వానించారని సమాచారం. ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఇదే పెద్ద చర్చ అయింది.

పవన్ కల్యాణ్ తో శరత్ మరార్ కొత్తగా ఓ చిత్రం చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. అందులో ఇద్దరు యువ నటులు చేయాల్సి ఉంది. ఈ పాత్రల్లో మెగా హీరోల చేత నటింపచేద్దామని శరత్ మరార్ అనుకున్నారట. అయితే వవాటిలో ఓ క్యారెక్టర్ ను విజయ్ చేత చేయించాలని పవన్ భావిస్తున్నట్లు టాక్. అందుకే విజయ్ కు ఫోన్ కాల్ వెళ్ళిందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ ను స్వయంగా అభినందించడానికే పవన్ ఆఫీసు నుంచి ఫోన్ కాల్ వెళ్ళిందనే వాదన కూడా ప్రచారంలో ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →