Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Vijay mallya

By   /  April 15, 2016  /  Comments Off on Vijay mallya

    Print       Email

vijay-mallya-new-reuters-Lమాల్యా పాస్‌పోర్టును ర‌ద్దు చేసిన ఈడీ

 

InCorpTaxAct
Suvidha

 

బ్యాంకుల‌కు చెల్లించాల్సిన డ‌బ్బులు క‌ట్ట‌కుండా ఎగ‌ర‌గొట్టిన ప్ర‌ముఖ పారిశ్రామిక విజ‌య్ మాల్యా పాస్ పోర్టును విదేశాంగ శాఖ ర‌ద్దుచేసింది. లండ‌న్‌లో ఉంటున్న విజ‌య్‌మాల్యాను విచారణకు హాజరు కావాలని ఈడీ మూడుసార్లు సమన్లు మాల్యా స్పందించ‌లేదు. తాజాగా ఏప్రిల్‌ 9న మాల్యా విచారణకు హాజరుకాకుండా తనకు మే చివరి వరకు గడువు కావాలని కోరారు. మాల్యాను దేశం విడిచి పోకుండా కట్టడి చేయాలని గతంలో బ్యాంకులు చేసిన విజ్ఞప్తితో… పాస్‌పోర్టుతో కోర్టులో హాజరుకావాలని మాల్యాను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆయన అప్పటికే దేశం విడిచి లండన్‌ వెళ్లిపోయారు. దీంతోఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సిఫార్సు మేరకు మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. అయితే విజ‌య్ మాల్యాకు కొంత‌మంది బ్యాంక‌ర్లు స‌హ‌క‌రించ‌డం వ‌ల‌నే అంత డ‌బ్బును తీసుకోగ‌లిగాడ‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. కాగా మాల్యాకు స‌హ‌క‌రించిన వారికి కూడా శిక్ష త‌ప్ప‌ద‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →