Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Vijay Mallya arrested and gets bail..

By   /  April 18, 2017  /  Comments Off on Vijay Mallya arrested and gets bail..

    Print       Email

VIJAY-MALLYAలిక్క‌ర్ డాన్ విజ‌య్ మాల్యా అరెస్ట్‌..?

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఇండియాలో బ్యాంకుల‌కు లిక్క‌ర్ డాన్ విజ‌య్ మాల్యా టోపీ పెట్టిన విష‌యం తెలిసిందే. వేల కోట్లు బాకీలు ఎగ్గొట్టి లండ‌న్ చెక్కేశాడు. అప్ప‌టి నుంచి అత‌న్ని భార‌త్ ర‌ప్పించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కోర్టు హెచ్చ‌రించినా మాల్యా బేఖాత‌ర్ చేశారు. అలాగే ఈడీ స‌మ‌న్లు జారీ చేసిన ప‌ట్టించుకోలేదు. విజ‌య్ మాల్యా మొత్తం 17 బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొటి లండన్ వచ్చేశాడని గ‌తంలోనే భార‌త్ .. బ్రిట‌న్ ప్ర‌భుత్వానికి తెలియ‌జేసింది.మాల్యాను అప్ప‌గించాల‌ని బ్రిట‌న్ ను ప‌దే ప‌దే కోరింది. భార‌త్ అభ్య‌ర్ధ‌న మేర‌కు బ్రిటన్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది.

ఈ అంశంపై స్పందించిన బ్రిట‌న్ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. విజ‌య్ మాల్యాను లండ‌న్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న్ను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వెస్ట్ మినిస్టర్స్ కోర్టులో మంగళవారం హాజరు పరిచారు. అయితే అరెస్ట్ అయిన మూడు గంటల వ్యవధిలోనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం విశేషం. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మాల్యాకు మంజూరు చేసింది. ఇక తన అరెస్ట్ పై విజయ్ మాల్యా ట్వీట్ట రూపంలో స్పందించారు. తన అరెస్ట్ అంశం పెద్ద విషయమేమి కాదని పేర్కొన్నారు. ఈ హడావుడి అంతా కేవలం మీడియా క్రియేట్ చేసిందేనని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →