Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Vijay Mallya: I hope that I return one day.. India has given me everything

By   /  March 14, 2016  /  Comments Off on Vijay Mallya: I hope that I return one day.. India has given me everything

    Print       Email

VijayMallya_3C_--621x414

భారత్ లో అడుగు పెట్టేదిలేదు.. ట్విట్టర్ లో మాల్యా..
తాను తిరిగి భారత్ లో అడుగుపెట్టేదిలేదని విజయ్ మాల్యా స్పష్టం చేవారు. తనపై క్రిమినల్ అనేటువంటి ముద్ర వేశారని అన్నారు. తాను బ్యాంకులకు అప్పులు ఎగవేశాననే ముద్ర వేశారన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అన్ని చక్కబడిన తర్వాతే తాను తిరిగి భారత్ లో అడుగుపెడతానన్నారు. ఈనెల 18న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చెక్‌ బౌన్స్ కేసు విచారణకు మాల్యా రాకపోవడాన్ని పరిగణనలోకి తీసుకొని నాంపల్లి కోర్టు ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంటును జారీ చేసింది. దీంతో విజయ్ మాల్యా ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

InCorpTaxAct
Suvidha

భారత్ లో పలు బ్యాంకుల్లో మాల్యాకు సుమారు రూ.9వేల కోట్ల అప్పులున్నాయని ఇటీవల పార్లమెంట్‌లో పెద్ద చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు మాల్యాపై ‘లుక్‌ అవుట్‌’ నోటీసు జారీ చేశారు. అయితే మాల్యా మార్చి 2న లండన్‌ వెళ్లినట్టు అధికారులు పార్లమెంట్‌కు వివరాలు సమర్పించారు. తన ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బ్యాంకులు అప్పులు ఇచ్చాయని తెలపిారు. లండన్‌ వెళ్లినా, భారత్‌ మీడియా తనను వదిలి పెట్టలేదని మాల్యా మండిపడ్డారు.’గతేడాది నాకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. కాని నేను పారిపోలేదు. మరి ఇప్పుడెందుకు నన్ను క్రిమినల్‌గా చూస్తున్నారు. రుణ ఎగవేత అంశం వ్యాపార లావాదేవీలకు సంబంధించింది. రుణాలిచ్చేటప్పుడు నష్ట భయం అన్నది బ్యాంకులకు తెలుస్తుంది. మా సంస్థలతో ఇబ్బంది లేదనే అవి నిర్ణయించాయి. మా సొంత వ్యాపారం చాలా బాగుండేది అయితే అనుకోకుండా ఇబ్బందుల్లో పడింది’ అని మాల్యా చెప్పారు. ‘నన్ను విలన్‌లా చేయండి.. నాకు మంచి ఉద్దేశాలే ఉన్నాయి. ఒకవేళ నోరు విప్పాల్సి వస్తే.. అది కొందరిని కష్టాల్లో పడేసే అవకాశం ఉంది’ అని తెలిపారు. ‘ నేనేం తప్పు చేయలేదు. నేనూ కూడా బాధితుణ్నే. ఎప్పడూ అందుబాటులో ఉండేవాడిని.. అందరూ కలిసి దాక్కునేలా చేశారు. దీనివల్ల అనారోగ్యం పాలయ్యా’ అని విజయ్ మాల్యా వివరించారు. మీడియా సంస్థల ప్రతినిధులతో తాను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →