ఫస్ట్ టైమ్ ఫారెన్ వెళ్తున్న స్టార్ హీరో..!
సినిమాల షూటింగ్ మొదలైతే చాలు హీరోలు ఫారెన్ లొకేషన్లకు చెక్కేస్తారు. షూటింగ్ తో పాటు ఫుల్ గా ఎంజాయ్ చేసేవారు ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరో మాత్రం దాదాపు 30 సినిమాల్లో నటించినా.. ఇప్పటివరకు విదేశాల్లో అడుగుపెట్టలేదు. ఎవరు నమ్మినా .. నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. ఇంతకీ ఆ హీరో ఎవరు అనేగా మీ డౌట్..?
కోలీవుడ్ లో విలక్షణ పాత్రలు చేస్తూ తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం అతను నటిస్తున్న ‘రెక్క’ మూవీ కోసం మొదటిసారిగా విదేశాలకు వెళ్తున్నారు. అంతకుముందు నటించిన ‘పిజ్జా’, ‘నడువుల కొంజం పక్కత్త కానోమ్’, ‘సూదుకవ్వుం’, ‘ఇదర్కుదానె ఆసైపట్ట బాలకుమార్’, ‘నానుమ్ రౌడిదాన్’, ‘సేతుపతి’, ‘ఇరైవి’ వంటి సినిమాలన్నీ ఇండియాలోనే షూటింగ్ జరుపుకున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు బడా బ్యానర్లలో తీసినవి కూడా ఉన్నాయి. ఈ సినిమాల్లో కనీసం పాటల కోసం కూడా ఫారెన్ లోకేషన్లకు వెళ్లలేదు. ఈ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి.
ప్రస్తుతం రత్న శివ డైరెక్షన్ లో నటిస్తున్న ‘రెక్క’ మూవీ సాంగ్స్ కోసం బ్యాంకాక్ లో షూటింగ్ జరపాలని నిర్ణయించారట. దీనికోసం విజయ్ సేతుపతి, లక్ష్మీ మీనన్ గురువారం బ్యాంకాక్ వెళ్లనున్నారు. ఈ సినిమాకి డి.ఇమామ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.