Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Virat Kohli’s Pakistani fan gets bail

By   /  February 27, 2016  /  Comments Off on Virat Kohli’s Pakistani fan gets bail

    Print       Email

kohli PAKISTAN fan umar

కోహ్లీ అభిమానికి బెయిల్ మంజూరు..!
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమాని అయిన పాకిస్థాన్ కు చెందిన యువకుడు ఉమర్ డ్రాజ్‌కు బెయిల్ లభించింది. గతనెల 25న ఇండియా – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ-20 మ్యాచ్‌లో కోహ్లీ 90 రన్స్ చేశాడు. దీంతో ఉమర్ తన ఇంటిపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. అంతేకాదు సంబరాలు కూడా జరుపుకున్నాడు. అయితే అతని చర్యలను పాకిస్థాన్ తీవ్రంగా పరిగణించింది. ఉమర్ దేశ సార్వభౌమాధికారానికి విరుద్ధంగా ప్రవర్తించాడంటూ అతనిపై కేసులు నమోదు చేసి.. కటకటాల్లోకి పంపింది. అయితే తాను కోహ్లీపై అభిమానంతోనే అలా చేశానని ఉమర్ చెప్పాడు. తాను చేసింది అంత పెద్ద నేరమవుతుందని తనకు తెలియదన్నాడు. అయితే న్యాయస్థానం మాత్రం ఉమర్ చేసింది అతిపెద్ద నేరమని వ్యాఖ్యానించింది. అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. అతను పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును ఈనెల 18న కోర్టు కొట్టివేసింది. అయితే ఉమర్ డ్రాజ్ మరోసారి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాడు. శుక్రవారం అతనికి రూ.50 వేల పూచికత్తుతో జడ్జి అసదుల్లా సిరాజ్ బెయిలు మంజూరు చేశారు.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →