Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Virat Kohli’s unbeaten 143 against West Indies

By   /  July 22, 2016  /  Comments Off on Virat Kohli’s unbeaten 143 against West Indies

    Print       Email

kohli_getty310116టీమిండియా దూకుడు!

 

InCorpTaxAct
Suvidha

 

 

టీమిండియా ఆట‌గాళ్లు దూకుడును ప్ర‌ద‌ర్శించారు. వెస్టిండిస్ బౌల‌ర్ల‌పై విరుకుప‌డ్డారు. సెంచ‌రీల‌తో చెల‌రేగిపోయారు. ఫ‌లితంగా మొద‌టి రోజు 3002 స్కోరు చేశారు. టాస్ గెలిచి కోహ్లి బ్యాటింగ్ తీసుకోగా… భారత్ ఆరంభంలో పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బందులుపడింది. విండీస్ పేసర్లు షార్ట్ బంతులతో ధావన్, విజయ్ (7)లపై దాడి చేశారు. ముఖ్యంగా హోల్డర్, గాబ్రియెల్ పేస్‌తో ధావన్‌ను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగారు. దీంతో రెండు, మూడుసార్లు బంతి ఎడ్జ్ తీసుకున్నా ఫీల్డర్ల చేతుల్లో వెళ్లకపోవడంతో ధావన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక రెండో ఎండ్‌లో విజయ్ వీలైనన్నీ బంతులను వదిలేస్తూ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నించాడు. కానీ తన ప్రణాళికలను పక్కగా అమలు చేసిన గాబ్రియెల్ ఏడో ఓవర్‌లో అద్భుతమైన బౌన్సర్‌తో విజయ్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో భారత్ 14 పరుగుల వద్ద తొలి వికెట్‌ను చేజార్చుకుంది. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా (16) ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆడాడు. 12వ ఓవర్‌లో కొత్త కుర్రాడు చేజ్.. ఆఫ్ బ్రేక్‌తో నిలువరించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఈ ఇద్దరి సమన్వయంతో భారత్ 24వ ఓవర్‌లో 50 పరుగులకు చేరుకుంది.

లంచ్ వరకు ఈ ఇద్దరు 118 బంతుల్లో రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. లంచ్ తర్వాత భారత్‌కు ఊహించని దెబ్బ తగిలింది. నాలుగో బంతికే బిషూ విసిరిన షార్ట్ బంతి పుజారా బ్యాట్‌ను తాకుతూ బ్రాత్‌వైట్ చేతిలోకి వెళ్లింది. దీంతో రెండో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కోహ్లి.. ధావన్ నిలకడగా ఆడారు. తొలిరోజు టెస్ట్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి కోహ్లీ (197 బంతుల్లో 16 ఫోర్లు) 143 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో వెస్టిండీస్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లకు 302 పరుగులు చేసింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →