Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Visakhapatnam does not have a railway junction

By   /  March 13, 2018  /  Comments Off on Visakhapatnam does not have a railway junction

    Print       Email

విశాఖ‌కు రైల్వే జోన్ లేదు

Suvidha
Biryani Pot

 

 

 

* రైల్వే జోన్ ఏర్పాటు వ‌ల్ల ఎలాంటి ప్ర‌త్యేక లాభాలూ ఉండ‌వు

* అందుకే రైల్వే రోజ్ ఏర్పాటు సాధ్యం కాదు

* స్ప‌ష్టం చేసిన కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి రాజీవ్ గాబే

డెక్క‌న్ అబ్రాడ్‌: తాము అధికారంలోకి వ‌స్తే ఏపీకి హోదాతో పాటు, విశాఖ‌కు రైల్వే జోన్ ఇస్తామ‌ని చెప్ప‌డంతో పాటు మేనిఫెస్టోలో పెట్టి ప్ర‌చారం చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు అవుతున్నా చేయ‌డం లేదు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌మ‌లేని చెబుతున్న కేంద్రం తాజాగా విశాఖ‌కు కూడా రైల్వే జోన్ ఇవ్వ‌మ‌ని చెబుతోంది. వివ‌రాల్లోకి వెళ్లితే… హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబే విభజన హామీల అమలుపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయటం ఆర్థికంగా ఎంతమాత్రం మంచిది కాదని ఎక్స్‌పర్ట్స్ కమిటీ  నివేదిక సూచించిందని ఆయన చెప్పారని అంటున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి లేనప్పుడు ప్రత్యేక జోన్‌ను ఎలా ఏర్పాటు చేస్తామని హోంశాఖ కార్యదర్శి ప్రశ్నించారని అంటున్నారు. ఆంధ్ర, తెలంగాణలో ఏర్పాటు చేయవలసిన గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన బిల్లులు సిద్ధమయ్యాయనీ, కేంద్ర మంత్రివర్గం వీటికి ఆమోదముద్ర వేయగానే ప్రకటిస్తామని రాజీవ్ గౌబే చెప్పారని అంటున్నారు.

తెలంగాణలో ఏర్పాటు చేయవలసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బదులు ఇంజన్ల ఓవర్ హౌలింగ్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని హోంశాఖ కార్యదర్శి చెప్పారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు అంశం పరిశీలనలో ఉన్నదని, తుది నిర్ణయం తీసుకోగానే తెలియజేస్తామన్నారు. రాష్ట్ర విభజన చట్టం 13వ షెడ్యూలులోని అంశాలపై సోమవారంనాటి సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు. 13వ షెడ్యూలులో విద్య, వౌలిక సదుపాయాల కల్పన అనే అంశాలున్నాయి. విద్యా అంశం పరిధిలో ఐదు అంశాలుంటే వౌలిక సదుపాయాల కింద పదకొండు అంశాలున్నాయి. సమావేశానికి ఏపీ నుండి చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్, ఆధిత్యనాథ్ దాస్, పలువురు ఇతర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుండి ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్, అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి హాజరయ్యారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TANA will not let criminals run our well earned reputation, Satish Vemana

Read More →