Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

విష్ణుషట్పదీ స్తోత్రం–ఆది శంకరాచార్య

By   /  March 7, 2016  /  Comments Off on విష్ణుషట్పదీ స్తోత్రం–ఆది శంకరాచార్య

    Print       Email
విష్ణుషట్పదీ స్తోత్రం–ఆది శంకరాచార్య
Vishnushankara1
అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః || 1||
ఓ విష్ణుమూర్తీ!నాలోని ఆజ్ఞానాంధకారం వలన కలిగిన అహంకారాన్ని అణచివేసి(తొలగించి)మనసును శాంతి అనే వెలుగుతో నింపుము! కోరికలనే ఎండమావులనుండి రక్షింపు!పశు వాంఛలను తొలగించి,సర్వ ప్రాణుల ఎడ సమభావం,కరుణ ఉండేటట్లుగా చేయగలవు!    
దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే |
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే || 2 ||
ఈ సంసారాన్ని ఈదటంలోని కష్టాలను పోగొట్టే పవిత్రమైన నది వంటి మరియు సుగంధపరిమళ భరితమైన నీ దివ్య చరణాలను నమస్కరించు చున్నాను! 
సత్యపి భేదాపగమే నాథ తవాఽహం న మామకీనస్త్వం |
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః || 3 ||
సముద్రంలోని అలలన్నీ విడివిడిగా కనిపించినప్పటికీ,అవన్నీ సముద్రంలోని భాగాలే!అలాగే ,సత్యాసత్యాలను గ్రహించినపుడు,గ్రహించలేనపుడు కూడా నేను నీ లోని అంతర్భాగాన్నే ప్రభూ!అంతేకానీ,నీవు నా లోని భాగం కాదు!
వివరణ–భగవంతునికి సర్వ సమర్పణం చేసుకున్నవాడికి ఇంక ‘నాది’ అనేదే ఉండదు కదా!
ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః || 4 ||
నీవు రెండు సార్లు పెద్ద కొండలను అవలీలగా మోసావు!(ఒకటి కూర్మావతారంలో ,రెండు కృష్ణావతారంలో)పర్వతాలకు శత్రువైన ఇంద్రుడి తమ్ముడిగా పుట్టి అతని రాజ్యాన్ని అతనికి ఇప్పించావు!(వామనావతారంలో)ఓ రాక్షస సంహారా,సూర్యచంద్రులు నేత్రాలుగా కలిగిన వాడా!నీ దయా దృష్టిని నా మీద ప్రసరించి, ఈ సంసారం మీద వైరాగ్యం కలిగేలా కరుణించు ప్రభూ!
మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధాం |
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహం || 5 ||
మత్స్య,కూర్మావతారాలవంటి దశావతారాలతో  ఈ భువనాన్ని కాపాడుతున్న నీవు ,ఈ భవసాగారాన్నించి  కాపాడలేవా? (కాపాడగలడని అర్ధం!) 
దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే || 6||
ఓ దామోదరా!(దామం ఉదరమందు కలవాడు!దామం అంటే పద్మం) సుందర వదనారవిందా గోవిందా !!ఈ సంసార సాగరాన్ని ఈదటానికి నాకు గల అన్ని భయాలను పోగొట్టు ప్రభూ!
నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ||
ఓ కరుణామయా !నారాయణా!నీ పాదపద్మములకు నారెండు  చేతులు జోడించి భక్తితో నమస్కరిస్తున్నాను!ఈ ఆరు శ్లోకాలు నా వదనంలో ఎల్లప్పుడూ నిలిచే లాగా ఆశీర్వదించు తండ్రీ!
శుభం భూయాత్! 
టీవీయస్.శాస్త్రి 
53  
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →