ఐఎస్ అంతానికి పుతిన్ చేయూత
ప్రపంచ వ్యాప్తంగా ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందిస్తారో తెలియక ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయి. మానవ బాంబులుగా మారుతున్న ఈ ఐఎస్ ఉగ్రవాదులు రోజూ ఎక్కడ ఒకచోట బాంబు పేలుళ్లతో వందల మంది ప్రాణాలను బలికొంటున్నారు. ఆలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు, రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకుంటూ మారణహోమానికి పాల్పడుతున్నారు. దీంతో ఐఎస్‌ను అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీఏకం కావాల్సిన అవసరం ఉందని ఇటీవల అన్ని దేశాల ప్రధానులు పిలుపునిస్తున్నారు. ఇటువంటి తరుణంలో రష్య అధ్యక్షుడు పునిత్ ఐఎస్ అంతానికి తనవంతుగా చేయూతనిస్తున్నారు. భూమిపై నరరూప రాక్షసుల ముఠాగా పేరుగాంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతు చూసేందుకు పునిత్ భారీ యుద్ధనౌకను సిరియాకు పంపుతున్నారు.
పెద్ద ఎత్తున హెలికాఫ్టర్లు ఫైటర్ జెట్లతో కూడిన అడ్మిరల్ కుజెత్నోవ్ యుద్ధనౌకను సిరియాకు పంపారు. 41 ఫైటర్ జెట్లు81 హెలికాఫ్టర్లు ఈ యుద్ధనౌకలో ఉన్నాయి. ఢాకా బాగ్దాద్ పేలుళ్ల నేపథ్యంలో ఐఎస్ అంతుచూసేందుకు అంతిమ యుద్ధానికి305మీటర్ల ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ను మధ్యదరా సముద్రానికి పంపుతున్నారు. ఈ యుద్ధ నౌకలో రష్యా నేవీ ఆర్మీ కూడా పెద్ద ఎత్తున సంసిద్ధంగా ఉంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలు, ఉగ్రవాదులు తలదాచుకునే ప్రాంతాలపై రష్యా నేవీ బాంబుల వర్షం కురిపించనుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.